Dailyhunt
హిందూ మహాసముద్రంలో భూకంపం!

హిందూ మహాసముద్రంలో భూకంపం!

వార్త 2 weeks ago

Indian Ocean Earthquake: హిందూ మహాసముద్రంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత (ఏప్రిల్ 5, 2026) భూకంపం సంభవించడంతో ఇండోనేషియా, శ్రీలంకతో పాటు ఆగ్నేయాసియా దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.

ముఖ్యంగా సుమత్రా దీవులకు సమీపంలో భూమి కంపించడంతో తీర ప్రాంత దేశాలు అప్రమత్తమయ్యాయి.

Read Also:Tamil Nadu Politics: పోటీ నుంచి థోళ్ తప్పుకున్న తిరుమావళవన్ .. వీసీకే కొత్త అభ్యర్థి ఎవరంటే?

Indian Ocean Earthquake: భూకంప కేంద్రం, తీవ్రత

నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ (NCS) అందించిన సమాచారం ప్రకారం. తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.2 గా రికార్డయింది. ఇండోనేషియా సమీపంలోని ప్రఖ్యాత తీర ప్రాంత నగరం బందా ఏక్ కు సమీపంలో హిందూ మహాసముద్రంలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. ఉపరితలం నుంచి 90 కిలోమీటర్ల దిగవన టెక్టానిక్ ప్లేట్స్ లల్లో చోటు చేసుకున్న కదలికల వల్ల భూమి కంపించినట్లు వివరించింది.

 Indian Ocean Earthquake Today April 2026

5.305 అక్షాంశం, 93.972 రేఖాంశం వద్ద గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించింది.అండమాన్ నికోబార్ ద్వీప సముదాయం, క్యాంప్ బెల్ బే కు 189 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ఏరియా. దీని ప్రభావంతో బందా ఏక్, ఇందిరా పాయింట్ వంటి తీరాల్లో అలజడి రేగింది. కెరాటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. బందా ఏక్ వద్ద సముద్రం కొంత ముందుకు చొచ్చుకు వచ్చింది. ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు వార్తలు అందలేదు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

"నా ఆదేశం ఇదే.. ఎవరి మాట వినొద్దు": కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha