Tamil Nadu Politics: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రణం ముదురుతున్న వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా డీఎంకే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న విడుదలై చిరుతైగళ్ కచ్చి (VCK) అధినేత థోళ్ తిరుమావళవన్ పోటీ నుంచి తప్పుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
Read Also: Annamalai: తమిళనాడు ఎన్నికల్లో అన్నామలై పోటీ చేయడం లేదు.. ఎందుకంటే?
పోటీ నుంచి ఎందుకు తప్పుకున్నారు?
చిదంబరం ఎంపీగా ఉన్న తిరుమావళవన్, తొలుత కట్టుమన్నార్ కోవిల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే శనివారం (ఏప్రిల్ 4, 2026) ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన పోటీపై వస్తున్న తప్పుడు ప్రచారాలను, విమర్శలను తిప్పికొట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. తాను రాష్ట్ర రాజకీయాల్లోకి రావడం వెనుక ‘ఉప ముఖ్యమంత్రి పదవి’ లేదా ‘హంగ్ అసెంబ్లీ’ ఆశలు ఉన్నాయన్న ఆరోపణలను ఆయన ఖండించారు.డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (SPA) ను కాపాడుకోవడానికి, కూటమి ఐక్యతను చాటడానికి ఇది ఒక “రాజకీయ వ్యూహం (Strategy)” అని ఆయన పేర్కొన్నారు.
తమిళనాడు శాసనసభ ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ ఎన్నికల్లో డీఎంకే, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళనాడుతో పొత్తులో ఉంది. గత 2021 అసెంబ్లీ ఎన్నికలలో, DMK పార్టీ VKCకి మొత్తం 6 అసెంబ్లీ సీట్లను కేటాయించింది. వీటిలో VKC అభ్యర్థులు 4 సీట్లను గెలుచుకున్నారు. దీని తర్వాత, ఈసారి రెండంకెల సంఖ్యలో సీట్లు కేటాయించాలని వీకేసీ డీఎంకేను కోరింది. కానీ డీఎంకే దానికి అంగీకరించకపోవడంతో, 8 సీట్లను కేటాయించింది.
Tamil Nadu Politics
Tamil Nadu Politics :కొత్త అభ్యర్థి ఎవరు?
తిరుమావళవన్.. చిదంబరం లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. ఈ దఫా రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని తొలుత భావించారు. కట్టుమన్నార్ కోవిల్ నుంచి పోటీ చేస్తాననీ ప్రకటించారు. ఇది వీకే పార్టీకి కంచుకోట. ఆ పార్టీకి చెందిన చింతన సెల్వన్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన స్థానంలో తిరుమావళవన్ పోటీ చేస్తానని వెల్లడించారు. ఇప్పుడాయన బరి నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది.కట్టుమన్నార్ కోవిల్ స్థానంలో, తిరుమావళవన్, జ్యోతిమణి ఇళయపెరుమాళ్‌ను అభ్యర్థిగా ప్రకటించారు.
దీనికి గల కారణాలను తిరుమావళన్ వెల్లడించారు. ఎంపీగా ఇంకా మూడేళ్ల పదవీకాలం ఉందని, అయినప్పటికీ అణగారిన ప్రజల కోసం అసెంబ్లీకి రావాలని తొలుత నిర్ణయించుకున్నానని వివరించారు. మంత్రిపదవి కోసమే తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోన్నాననే ఆరోపణలు వస్తోన్నాయని, వాటిని తిప్పికొట్టడం అవసరం ఉందని అన్నారు. తనకు పదవీ కాంక్ష లేదనే విషయాన్ని తెలియజేయడానికే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటోన్నానని పేర్కొన్నారు.
తమిళనాడులో ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరింది.తమిళగ వెట్రి కజగం (TVK) చీఫ్ విజయ్, తిరుచిరాపల్లి ఈస్ట్ (ట్రిచీ ఈస్ట్) మరియు పెరంబూర్ నియోజకవర్గాల నుంచి నామినేషన్ దాఖలు చేసి ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, తన మిత్రపక్షాలైన కాంగ్రెస్, వీసీకే, సీపీఐ, సీపీఎంలతో కలిసి 200 పైగా సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. వీసీకేకు ఈ ఎన్నికల్లో 8 సీట్లు కేటాయించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

