Dailyhunt
హీరో విజయ్ విడాకుల కేసు..వీడియో కాన్ఫరెన్స్‌కు నో చెప్పిన కోర్టు

హీరో విజయ్ విడాకుల కేసు..వీడియో కాన్ఫరెన్స్‌కు నో చెప్పిన కోర్టు

వార్త 1 week ago

Vijay Sangeetha Divorce: తమిళనాడు రాజకీయాల్లో, సినీ రంగంలో అత్యంత ఆసక్తి రేపుతున్న హీరో విజయ్ విడాకుల కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

భార్య సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌పై సోమవారం చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది.

Read Also:Rishab Shetty praises Youth Movie: 'యూత్' సినిమా చూసి హాయిగా నవ్వుకున్నా..రిషబ్ శెట్టి

కోర్టులో ఏం జరిగింది?

విచారణ సందర్భంగా విజయ్ తరపు న్యాయవాదులు ఒక కీలక ప్రతిపాదనను కోర్టు ముందు ఉంచారు.ప్రస్తుతం విజయ్ తన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) తరపున తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అత్యంత బిజీగా ఉన్నారని, అందుకే ఆయన వ్యక్తిగతంగా హాజరు కాలేరని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.అయితే, ఈ విన్నపాన్ని కోర్టు తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులు విడిపోయే సందర్భంలో వారిని నేరుగా సంప్రదించడం ముఖ్యం అని భావించిన న్యాయస్థానం, జూన్ 15న విజయ్ మరియు సంగీత ఇద్దరూ భౌతికంగా (Physically) కోర్టుకు హాజరుకావాలని స్పష్టం చేసింది.

 Vijay Sangeetha divorce case hearing June 15

Vijay Sangeetha Divorce: జూన్ 15న కీలక విచారణ

కోర్టు ఈ కేసును జూన్ 15కు వాయిదా వేసింది. ఆరోజు విజయ్, సంగీత మధ్య కౌన్సెలింగ్ జరిగే అవకాశం ఉందని, ఒకవేళ ఇరువురు తమ నిర్ణయంపై స్థిరంగా ఉంటే విడాకుల ప్రక్రియ తదుపరి దశకు చేరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఒకవైపు రాజకీయ పోరాటం, మరోవైపు వ్యక్తిగత జీవితంలోని సమస్యలతో విజయ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 24 ఏళ్ల వైవాహిక బంధం ముగియబోతుందనే వార్త ఆయన అభిమానులను కలచివేస్తోంది. జూన్ 15న విజయ్ కోర్టుకు హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

మళ్ళీ పట్టాలెక్కనున్న క్లాసిక్ జోడీ: దిల్ రాజు నిర్మాణంలో మరో ప్రేమకావ్యం?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha