Rishab Shetty praises Youth Movie: కోలీవుడ్‌లో చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న 'యూత్' ఇప్పుడు ఓటీటీలోనూ సత్తా చాటుతోంది.
యంగ్ టాలెంట్ కెన్ కరుణాస్ స్వయంగా నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాపై తాజాగా కన్నడ స్టార్ రిషబ్ శెట్టి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Read Also: Tharun Bhaskar: కామెడీకి గుడ్ బై చెప్పనున్న తరుణ్ భాస్కర్?
Rishab Shetty praises Youth Movie: రిషబ్ శెట్టి ఏమన్నారంటే?
సినిమా చూసిన అనంతరం రిషబ్ శెట్టి తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు."చాలా కాలం తర్వాత ఒక సినిమా చూస్తూ ఇంత హాయిగా, మనస్ఫూర్తిగా నవ్వుకున్నాను. ఈ సినిమాలో చూపించిన ప్రేమ, స్నేహం, డీప్ ఎమోషన్స్ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి.""రచన, దర్శకత్వం, నటన.. ఇలా అన్ని విభాగాలను ఒంటిచేత్తో నడిపించిన కెన్ కరుణాస్ ఈ సినిమాకు మెయిన్ ఎసెట్. ఆయన ప్రతిభ అద్భుతం."జీవీ ప్రకాష్ అందించిన సంగీతం, ఫ్రెండ్స్ గ్యాంగ్ పండించిన వినోదం సినిమాకు ప్రాణం పోశాయని రిషబ్ కొనియాడారు.
నెట్‌ఫ్లిక్స్‌లో దూకుడు
రిషబ్ శెట్టి వంటి స్టార్ నటుడు ఈ సినిమాను ప్రశంసించడంతో సినిమాకు భారీ రీచ్ లభించింది. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. కేవలం యూత్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా ఈ సినిమా నచ్చుతుండటం విశేషం.
కథ విషయానికి వస్తే.. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ప్రవీణ్ (కెన్ కరుణాస్) అనే యువకుడి చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. కొడుకును ఎలాగైనా ఐఏఎస్ ఆఫీసర్‌గా చూడాలని తల్లి ఆశపడుతుంటే, ప్రవీణ్ మాత్రం తన కాలేజీ జీవితంలో ముగ్గురు అమ్మాయిలతో ప్రేమాయణంలో మునిగితేలుతుంటాడు. ఆ ముగ్గురు అమ్మాయిల్లో ప్రవీణ్ నిజంగా ఎవరిని ప్రేమించాడు? ఆ గందరగోళం మధ్య అతని కుటుంబంలో తలెత్తిన సమస్యలేమిటి? చివరికి అతను తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా? అన్నది మిగిలిన కథ.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
ట్రోల్స్‌కు చెక్ పెట్టిన అనన్య: ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ వెనుక అసలు రహస్యం ఇదే!

