Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మ్యాచో స్టార్ గోపీచంద్ 'సింగా' ఇంటెన్స్ పోస్టర్ విడుదల

మ్యాచో స్టార్ గోపీచంద్ 'సింగా' ఇంటెన్స్ పోస్టర్ విడుదల

వార్త 5 hrs ago

Gopichand Singa Movie: టాలీవుడ్‌లో పక్కా మాస్, సాలిడ్ యాక్షన్ చిత్రాలకు చిరునామాగా నిలిచే మ్యాచో స్టార్ గోపీచంద్ తన సినీ ప్రయాణంలో మరో భారీ విజువల్ ట్రీట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

విలక్షణ కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పించే ఆయన, ఈసారి పూర్తి భిన్నమైన పీరియడ్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ స్టంట్ మాస్టర్ వి. వెంకట్ మెగాఫోన్ పట్టి తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం 'సింగా' షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది.

గతంలో గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ సినీ వర్గాల్లో విశేష ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ఇంటెన్స్ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Actress Priyavadana Suicide: కోలీవుడ్ నటి, న్యూస్ రీడర్ ప్రియవదన ఆత్మహత్య

 Intense poster of ‘Singa’ featuring Macho Star Gopichand released

Gopichand Singa Movie: రౌద్ర రూపంలో గోపీచంద్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న పోస్టర్

చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో గోపీచంద్ మునుపెన్నడూ చూడని రీతిలో ఒక వీర సైనికుడి అవతారంలో దర్శనమిచ్చారు. పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో, ఒంటినిండా యుద్ధ రక్తం, కళ్లలో రగిలే ప్రతీకార జ్వాలలతో ఉన్న ఆయన లుక్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. పవర్ ఫుల్ బాడీ లాంగ్వేజ్‌తో పాటు ముఖంలో కనిపించే గాంభీర్యం సినిమాపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

అత్యున్నత నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్ చిత్రం

70mm ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాతలు విజయ్ చిల్ల, శశి దేవిరెడ్డి ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత నిర్మాణ విలువలతో, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా మలయాళ ముద్దుగుమ్మ అనార్కలి నజర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. శక్తివంతమైన విలన్ పాత్రలో సాకిబ్ అయూబ్ నటిస్తున్నారు. షామ్‌దత్ ఐఎస్‌సీ విజువల్స్ అందిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు సామ్ సి.ఎస్. నేపధ్య సంగీతం సమకూరుస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు.

50 శాతం షూటింగ్ పూర్తి..

ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే 50 శాతం పూర్తయింది. భారీ సెట్స్, హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్లతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన తదుపరి కీలక షెడ్యూల్ డిసెంబర్ నుంచి ప్రారంభం కానుంది. స్టంట్ మాస్టర్‌గా ఎన్నో హిట్ చిత్రాలకు అద్భుతమైన ఫైట్స్ సమకూర్చిన వి. వెంకట్ ఈ చిత్రం ద్వారా తొలిసారి దర్శకుడిగా పరిచయం అవుతుండటంతో, వెండితెరపై యాక్షన్ సన్నివేశాలు సరికొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha