Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హిట్‌ అండ్‌ రన్‌ కేసు - ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌ సాయి కుమారుడి అరెస్ట్

హిట్‌ అండ్‌ రన్‌ కేసు - ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌ సాయి కుమారుడి అరెస్ట్

వార్త 1 week ago

Anand Sai Son Sandeep : హైదరాబాద్ ఖాజాగూడలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో రాయదుర్గం పోలీసులు కీలక పురోగతి సాధించారు. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిగా ఉన్న ప్రముఖ సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

అతనితో పాటు ప్రమాదంలో ప్రమేయం ఉన్న అతని స్నేహితుడు శౌర్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. మృతుడిని బిహార్‌కు చెందిన నందకిశోర్ (31)గా పోలీసులు గుర్తించారు. అతను రాయదుర్గంలోని ఒక హోటల్‌ కిచెన్ హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఖాజాగూడ తౌటోనికుంట వద్ద నందకిశోర్ రోడ్డు దాటుతుండగా నానక్‌రాంగూడ ఓఆర్‌ఆర్ వైపు నుంచి వచ్చిన ఇన్నోవా క్రిస్టా వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అతనికి స్వల్ప గాయాలయ్యాయి.ఇన్నోవా డ్రైవర్ జైద్‌ షా కద్రి, మరొక క్యాబ్ డ్రైవర్‌తో కలిసి గాయపడిన నందకిశోర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు రోడ్డు దాటించే ప్రయత్నం చేశారు.సరిగ్గా అదే సమయంలో ఖాజాగూడ నుంచి నానక్‌రాంగూడ వైపు అతివేగంగా వచ్చిన రెండు కార్లు వరుసగా వారిని బలమైన వేగంతో ఢీకొట్టాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నందకిశోర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Read Also: Karimnagar RTC Bus: బావిపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. త్రుటిలో తప్పిన ప్రమాదం!

 Anand Sai Son Sandeep Arrested in Hyderabad

Anand Sai Son Sandeep : సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల గుర్తింపు

ప్రమాదానికి కారణమైన వాహనాలు నిలపకుండా వెళ్లిపోవడంతో రాయదుర్గం సీఐ భూపతి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. ఖాజాగూడ నుంచి నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ఉన్న పలు సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను జల్లెడ పట్టారు.సందీప్ నడుపుతున్న కారు ఢీకొట్టడం వల్లే నందకిశోర్ మృతి చెందినట్లు పోలీసులు ఆధారాలు సేకరించి, అతనితో పాటు మరొక కారు నడిపిన శౌర్యను మంగళవారం అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

దిశా సాలియాన్ మృతి కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha