Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా ఏజెన్సీని ఏర్పాటు చేశానన్న సీఎం రేవంత్

హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా ఏజెన్సీని ఏర్పాటు చేశానన్న సీఎం రేవంత్

వార్త 6 days ago

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్‌లో చెరువుల రక్షణ, ఆక్రమణల తొలగింపు కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'హైడ్రా' (HYDRAA) వ్యవస్థకు..

జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ స్ఫూర్తితోనే ఆ పేరు పెట్టానని ఆయన వెల్లడించడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బెంగళూరు వేదికగా జరిగిన ‘ది హిందూ’ హడిల్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

 Adolf Hitler Hydra

Read also: Fish Prasadam2026: హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

హిట్లర్ కోర్ టీమ్ అంటూ సీఎం వ్యాఖ్యలు..

ప్రభుత్వ భూములు, జలవనరుల ఆక్రమణదారులపై హైడ్రా ఏజెన్సీ కఠినంగా వ్యవహరిస్తోందని సమర్థించే క్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. “హిట్లర్‌కు అత్యంత ఇష్టమైన పదం ‘హైడ్రా’. ఎవరినైనా మట్టుబెట్టగల సత్తా ఉన్న తన కోర్ టీమ్‌కు హిట్లర్ ఆ పేరు పెట్టుకున్నారు. అందుకే నేను కూడా హిట్లర్ నుంచి ఇన్‌స్పిరేషన్ పొంది మన ఏజెన్సీకి హైడ్రా అని నామకరణం చేశాను” అని సీఎం వివరించారు.

అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన హిట్లర్ కథనంలో చారిత్రక వాస్తవాలు లేవని నిపుణులు గుర్తుచేస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లర్ నాజీ సైన్యంలో ‘హైడ్రా’ పేరిట ఎలాంటి హంతక బృందాలు లేవని, నిజానికి నాజీ జర్మనీని దెబ్బతీయడానికి బ్రిటన్ వైమానిక దళం (RAF) చేపట్టిన ఒక వ్యూహాత్మక బాంబు దాడి ఆపరేషన్‌కు ‘ఆపరేషన్ హైడ్రా’ అని పేరుందని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు.

Revanth Reddy: రాజకీయంగా కాక రేపుతున్న విమర్శలు:

ఈ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ స్థాయిలో తీవ్రంగా స్పందించింది. ఇది కాంగ్రెస్ పార్టీ రక్తంలోనే ఉన్న ‘హిట్లర్, ఎమర్జెన్సీ మనస్తత్వానికి’ పరాకాష్ట అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ధ్వజమెత్తారు. దీన్ని పక్కా ‘నియంతృత్వ పోకడ’గా అభివర్ణించిన ఆయన.. గతంలో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ రోజులను రేవంత్ వ్యాఖ్యలు గుర్తుచేస్తున్నాయన్నారు. అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (BRS) సైతం ముఖ్యమంత్రి తీరును తీవ్రంగా ఖండించింది. అటు సోషల్ మీడియా వేదికగా కూడా సీఎం వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్న శైలిలో ట్రోల్స్, విమర్శలు గుప్పిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

తెలంగాణలో జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిగింపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha