Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హిట్‌మ్యాన్‌ను అధిగమించిన మంధాన..టీ20లో సరికొత్త అధ్యాయం

హిట్‌మ్యాన్‌ను అధిగమించిన మంధాన..టీ20లో సరికొత్త అధ్యాయం

వార్త 2 months ago

Smriti Mandhana: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ టీమిండియాకు చేదు ఫలితాన్ని మిగిల్చినప్పటికీ, వ్యక్తిగతంగా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన మాత్రం ఒక అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది.

టీ20 అంతర్జాతీయ ఫార్మాట్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా ఆమె చరిత్ర పుటల్లో నిలిచింది.

Read Also:CSK vs SRH: సన్‌రైజర్స్‌తో పోరుకు 'తలా' సిద్ధం.. తుది జట్టులో ఉంటారా?

Smriti Mandhana: రోహిత్ శర్మ రికార్డు బద్దలు

ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు స్మృతి మంధాన, టీమిండియా పురుషుల జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరూ 4,231 పరుగులతో సమానంగా ఉన్నారు.ఈ మ్యాచ్‌లో మంధాన 13 పరుగులు చేసి (మొత్తం 4,244 పరుగులు) అయాబొంగా ఖాకా బౌలింగ్‌లో వెనుదిరిగింది.దక్షిణాఫ్రికా బౌలర్ సునే లూస్ వేసిన బంతిని సింగిల్ తీయడం ద్వారా మంధాన 4,232వ పరుగును అందుకుంది. తద్వారా రోహిత్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరుకుంది.

గణాంకాలు చూస్తే..

ఆమె కెరీర్‌లో ఒక సెంచరీ, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు రోహిత్ శర్మ 159 మ్యాచ్‌ల్లో 5 సెంచరీలు, 32 అర్ధశతకాలతో 4,231 పరుగులు చేశాడు.2024 టీ20 ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మంధాన రికార్డును తిరిగి అధిగమించే అవకాశం అతనికి లేదు. ఫలితంగా భారత టీ20 క్రికెట్‌లో పరుగుల రాణిగా స్మృతి మంధాన స్థానం పదిలంగా నిలవనుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

'సర్పంచ్' ట్యాగ్‌పై శ్రేయస్ అయ్యర్ ఏమన్నారంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha