Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సన్‌రైజర్స్‌తో పోరుకు 'తలా' సిద్ధం.. తుది జట్టులో ఉంటారా?

సన్‌రైజర్స్‌తో పోరుకు 'తలా' సిద్ధం.. తుది జట్టులో ఉంటారా?

వార్త 2 months ago

CSK vs SRH: ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభం నుంచి ఎంఎస్ ధోనీని మైదానంలో చూడలేక నిరాశలో ఉన్న అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. చీలమండ గాయం కారణంగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోనీ, శనివారం సాయంత్రం జరగబోయే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మ్యాచ్ కోసం జట్టుతో కలిసి భాగ్యనగరానికి చేరుకున్నారు.

Read Also: IPL 2026 : డేవిడ్ పేన్ ప్లేస్ లో కీలక పేసర్ ను తీసుకున్న SRH

వైరల్ అవుతున్న వీడియో

చెన్నై సూపర్ కింగ్స్ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. అందులో ధోనీ టీమ్ బస్సులో ప్రయాణిస్తూ చిరునవ్వుతో కనిపించారు. దీంతో సోషల్ మీడియాలో #Dhoni, #CSKvsSRH ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ధోనీ హైదరాబాద్‌ రాకతో ఉప్పల్ స్టేడియంలో ఈ రాత్రి ఎల్లో జెర్సీల సందడి మామూలుగా ఉండదని అర్థమవుతోంది.

CSK vs SRH: ఫిట్‌నెస్ పరిస్థితి ఏంటి?

తాజా సమాచారం ప్రకారం.. ఎంఎస్ ధోనీ నెట్స్‌లో కేవలం లైట్ ప్రాక్టీస్ మాత్రమే చేస్తున్నాడు. ధోనీ ఇంకా పూర్తి బలంతో బ్యాటింగ్ చేయడం లేదని.. కేవలం త్రో-డౌన్లను మాత్రమే ఎదుర్కొంటున్నాడని తెలుస్తోంది. అలాగే కీపింగ్ ప్రాక్టీస్ కూడా ఇంకా మొదలుపెట్టలేదని సమాచారం. గత మ్యాచ్‌లకు జట్టుతో ప్రయాణించని ధోనీ.. ఈ సారి హైదరాబాద్‌కు రావడం సానుకూల అంశమే అయినప్పటికీ.. ఆయన నేరుగా తుది జట్టులోకి వస్తాడా అన్నది సందిగ్ధంగానే ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

తొలి టీ20లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ చిత్తు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha