Visakhapatnam crime: విశాఖపట్నం నగరం లోని ద్వారక క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న గోవిందరాజు తన నివాసంలోనే అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Read Also: Eluru Crime: ఇన్‌స్టా ప్రేమ.. వివాహిత ఆత్మహత్య
Visakhapatnam crime: Home Guard Govindaraju dies under suspicious circumstances!
Visakhapatnam crime: తలుపులు బద్దలు కొట్టి లోపలికి..
గోవిందరాజు ఇంటి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో సమాచారం అందుకున్న ఎయిర్‌పోర్టు పోలీసులు రంగంలోకి దిగారు. సీఐ శంకర్ నారాయణ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో, పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి పరిశీలించగా గోవిందరాజు మృతి చెంది ఉండటం గమనించారు.
కేజీహెచ్‌కు మృతదేహం తరలింపు
పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ (KGH) ఆసుపత్రికి తరలించారు. ఈ మృతి వెనుక ఉన్న కారణాలు ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే వెల్లడవుతాయని అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

