Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హోటల్‌లో హీరోను చెప్పుతో కొట్టిన అనుపమ?.. అసలు నిజమేంటి?

హోటల్‌లో హీరోను చెప్పుతో కొట్టిన అనుపమ?.. అసలు నిజమేంటి?

వార్త 2 weeks ago

Anupama Parameswaran: సినిమా పరిశ్రమలో ప్రేమ, డేటింగ్, బ్రేకప్‌లకు సంబంధించిన వార్తలు తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. అయితే, ఇటీవల తమిళ సినిమా రంగానికి చెందిన ఒక యువ హీరో, దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఒక టాలెంటెడ్ హీరోయిన్ మధ్య నడిచిన ప్రేమాయణం తీవ్రస్థాయి విభేదాలతో ముగిసిందంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

ఈ క్రమంలో వీరిద్దరి మధ్య జరిగిన వివాదం సినిమా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక తమిళ చిత్రంలో కలిసి నటించిన సమయంలో సదరు హీరో, హీరోయిన్‌ల మధ్య స్నేహం ఏర్పడి, అది కాస్త ప్రేమగా మారింది. కొంతకాలంగా చాటుమాటుగా డేటింగ్ చేస్తున్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే, ఉన్నట్టుండి వీరి రిలేషన్‌షిప్‌కు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఎండ్ కార్డ్ పడిందనే వార్తలు బయటకు వచ్చాయి.

Read Also : Chennai Love Story : 'చెన్నె లవ్ స్టోరీ' ప్రీరిలీజ్ వేడుకకు మెగాస్టార్?

 Did Anupama hit the hero with a slipper at the hotel?

Anupama Parameswaran: వివాదానికి గల అసలు కారణమేంటి?

సినీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. సదరు హీరో సదరు హీరోయిన్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాల్లో మితిమీరి జోక్యం చేసుకోవడం, ఆమె నిర్ణయాలను డిక్టేట్ చేయడానికి ప్రయత్నించడమే ఈ గొడవలకు కారణమని తెలుస్తోంది. హీరో ప్రవర్తనతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆ నటి, ఆయనకు దూరంగా ఉండటం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో మాట మాట పెరిగి ఓ దశలో హీరోను అనుపమ చెప్పుతో కొట్టినట్లు వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. తనను ఏడిపించిన వారు బాగుపడరని తిడుతూ అక్కడి నుంచి ఆమె వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమయంలోనే, ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్ ఇన్స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక పోస్ట్ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. జీవితంలో తనకు స్వేచ్ఛ లభించింది అనే కోణంలో ఆమె చేసిన పోస్ట్‌ను ఈ చెన్నై హోటల్ ఘటనతో ముడిపెడుతూ నెటిజన్లు పలు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే, ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది అధికారికంగా సదరు నటీనటులు గానీ, ప్రత్యక్ష సాక్షులు గానీ స్పందిస్తే తప్ప స్పష్టత వచ్చే అవకాశం లేదు.

నయనతార డబుల్ ధమాకా!.. ఆగస్టులోనే రెండు చిత్రాలు విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha