Husnabad Land Acquisition: హుస్నాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ లో భూమిని కోల్పోతున్న బాధిత రైతులకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని, భూ సేకరణకు రైతులు సహకరించాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి తెలిపారు.
శుక్రవారం హుస్నాబాద్ సమీకృత కార్యాలయ సముదాయం లోని మీటింగ్ హాల్ లో టిజీఐఐసి ఇండస్ట్రియల్ పార్క్ లో వలన భూమి కోల్పోతున్న అక్కన్న పేట మండలం చౌటపల్లి , జనగామ, తోటపల్లి గ్రామాల రైతులతో భూ సేకరణ ప్రక్రియ గూర్చి జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
Read Also: Hyderabad Drug Tests: హైదరాబాద్ లో రౌడీషీటర్లకు డ్రగ్ టెస్టులు.. 190 మందికి పాజిటివ్
We will support the farmers of Husnabad Industrial Park: Collector.
Husnabad Land Acquisition: ఈ సమావేశం లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….
హుస్నాబాద్ నియోజకవర్గంలో అక్కన్న పేట మండలంలో చౌటపల్లి , జనగాం, తోటపల్లి గ్రామాల్లో దాదాపు 124 ఎకరాలు భూమి టిజీఐఐసి కి అందించి ఇండస్ట్రియల్ పార్క్ గా అభివృద్ధి చేసి ఈ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపనతో ప్రాంత యువతకు ఉద్యోగ ఉపాధి లభిస్తుందని ప్రాంత అభివృద్ధి కోసం భూమిని ఇవ్వడానికి అందరూ సహకారం అవసరం అని తెలిపారు. మీప్రజావసరాల కోసం భూమిని త్యాగం చేస్తున్న మీకు ప్రభుత్వ తరపున దక్కాల్సిన నష్టపరిహారం త్వరగా అందేలా చూస్తామని భూమిని త్వరగా అందించేందుకు రైతులు ముందుకు రావాలని సూచించారు. ప్రభుత్వ నియమావళి ప్రకారం అందరికీ ఆమోద యోగ్యమైన పరిహారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి, తహసిల్దార్లు తదితరులు ఉన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

