Dailyhunt
హైదరాబాద్ లో రౌడీషీటర్లకు డ్రగ్ టెస్టులు.. 190 మందికి పాజిటివ్

హైదరాబాద్ లో రౌడీషీటర్లకు డ్రగ్ టెస్టులు.. 190 మందికి పాజిటివ్

వార్త 1 week ago

Hyderabad Drug Tests: భాగ్యనగరంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు డ్రగ్స్ రహిత నగరంగా మార్చేందుకు హైదరాబాద్ పోలీసులు సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా నగరంలోని రౌడీషీటర్లపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు, వారికి డ్రగ్ టెస్టులు నిర్వహించడం సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్‌ఫోర్సుమెంట్ విభాగం (H-NEW) ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

Read Also : Karimnagar: కరీంనగర్‌ పోలీస్ శాఖలో భారీ కుంభకోణం.. మరణించిన వారికి జీతాలు!

 Drug tests for rowdy sheeters in Hyderabad.. 190 people tested positive

190 మందికి గంజాయి పాజిటివ్

నగర వ్యాప్తంగా ప్రస్తుతం 1,300 మందికి పైగా రౌడీషీటర్లు పోలీస్ రికార్డుల్లో ఉన్నారు. వీరిలో మొదటి విడతగా సుమారు 250 మందికి పైగా రౌడీషీటర్లను అదుపులోకి తీసుకుని నార్కొటిక్స్ విభాగం అధికారులు డ్రగ్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అత్యధికంగా 190 మందికి గంజాయి (Cannabis) వాడుతున్నట్లు పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. రౌడీషీటర్లలో ఇంత పెద్ద సంఖ్యలో డ్రగ్స్ అలవాటు ఉండటం పోలీసు వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది.

Hyderabad Drug Tests: డ్రగ్స్ కోణంలో నేరాలు

రౌడీషీటర్లు డ్రగ్స్ బారిన పడటం వల్ల నగరంలో నేరాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గంజాయి మత్తులో దాడులు, హత్యలు, వసూళ్లకు పాల్పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో, డ్రగ్స్ వాడుతున్నట్లు తేలిన రౌడీషీటర్లపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. వీరిపై పీడీ యాక్ట్ (PD Act) నమోదు చేయడం లేదా వారి కదలికలపై నిరంతర నిఘా ఉంచడం వంటి చర్యలను పరిశీలిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha