Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రహదారిపై వరి ధాన్యం పోసి రైతుల నిరసన!

రహదారిపై వరి ధాన్యం పోసి రైతుల నిరసన!

వార్త 1 week ago

Sangareddy Farmers Protest: సంగారెడ్డి జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాందేడ్ - అకోలా 161వ జాతీయ రహదారిపై చౌటాకూర్ మండలం కొర్పోల్ గ్రామానికి చెందిన రైతులు బుధవారం భారీ ధర్నా నిర్వహించారు.

రోడ్డుపై ధాన్యం పోసి నిరసన

సుల్తాన్‌పూర్ వద్ద జాతీయ రహదారిపైకి చేరుకున్న రైతులు, బస్తాల్లో ఉన్న వరి ధాన్యాన్ని రోడ్డుపై పోసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. గత వారం రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఉన్నా, అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ రోడ్డుపైనే బైఠాయించడంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Read Also: Bandi Bhagirath POCSO Case: చట్టం ఎవరికీ చుట్టం కాదు: బండి సంజయ్ భావోద్వేగం

కలెక్టర్ ఆదేశాలూ బేఖాతరు

గత వారం రోజుల క్రితమే జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కొర్పోల్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే, కలెక్టర్ స్వయంగా ఆదేశించినా సిబ్బంది మాత్రం బేఖాతరు చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో కొనుగోలు సిబ్బంది తీరు వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, వర్షం వస్తే ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Sangareddy Farmers Protest: రంగంలోకి పోలీసులు

రైతుల ధర్నాతో జాతీయ రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులతో చర్చలు జరిపారు. ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే కొనుగోళ్లు ప్రారంభమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చి, ధర్నా విరమించాలని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తమ ధాన్యం కొనే వరకు కదిలేది లేదని రైతులు భీష్మించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

జూన్ 2న ఆదిలాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత.. పొంగులేటి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha