Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hyderabad: UBS గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ఏర్పాటు

Hyderabad: UBS గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ఏర్పాటు

వార్త 4 months ago

హైదరాబాద్ (Hyderabad) నగరం పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందనే విషయం మరోసారి రుజువైంది. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ వ్యాపార విస్తరణ కోసం హైదరాబాద్‌ను ఎంచుకుంటూ వస్తున్నాయి.

ఐటీ, ఫార్మా, ఫైనాన్షియల్ సర్వీసెస్, స్టార్టప్ రంగాల్లో నగరం దేశానికే కాదు, ప్రపంచానికి కేంద్రబిందువుగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో కీలక అంతర్జాతీయ సంస్థ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.

Henley Passport Index 2026: పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల

ముఖ్యఅతిథిగా శ్రీధర్‌బాబు

స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ పెట్టుబడి బ్యాంకు, ఆర్థిక సేవల సంస్థ యూబీఎస్ (UBS) హైదరాబాద్‌ (Hyderabad) లో తమ కార్యకలాపాలను విస్తరించింది. గచ్చిబౌలి ప్రాంతంలో అత్యాధునిక హంగులతో రూపొందించిన నూతన, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (Global Capability Centre)ను బుధవారం, ఫిబ్రవరి 11న అధికారికంగా ప్రారంభించింది. ఈ విస్తరణ ద్వారా వచ్చే రెండేళ్లలో దాదాపు 3 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆర్థిక సంస్థలకు హైదరాబాద్‌ నగరం ప్రాధాన్య గమ్యస్థానంగా మారిందని అన్నారు. యూబీఎస్‌ ఇక్కడ కార్యకలాపాలను మరింత విస్తరించడం.. గ్లోబల్‌ టాలెంట్, ఇన్నోవేషన్‌ హబ్‌గా హైదరాబాద్ నగరంపై ఉన్న విశ్వసనీయతను ప్రతిబింబిస్తోందని తెలిపారు. జీసీసీల కోసం తెలంగాణ బలమైన ఎకో సిస్టమ్‌ను నిర్మిస్తోందని చెప్పారు. తమ ప్రభుత్వ విధానాలు, స్థిరత్వంపై అంతర్జాతీయ పరిశ్రమలకు ఉన్న నమ్మకానికి ఈ సెంటర్ విస్తరణ నిదర్శనమని వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha