Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హ్యుందాయ్, మారుతీ కార్ల ధరలు పెంపు..!

హ్యుందాయ్, మారుతీ కార్ల ధరలు పెంపు..!

వార్త 1 month ago

Hyundai - Maruthi : దేశీయ ఆటోమొబైల్ రంగంలో ప్రముఖ వాహన తయారీ సంస్థలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ కార్ల కొనుగోలుదారులకు గట్టి షాకిచ్చాయి.

పెరుగుతున్న ఉత్పత్తి వ్యయం, ముడిసదరుల ధరల భారాన్ని తట్టుకునేందుకు తమ వాహనాల ధరలను (Hyundai – Maruthi) పెంచుతున్నట్లు ఆయా కంపెనీలు అధికారికంగా ప్రకటించాయి.

మారుతి సుజుకీ ధరల పెంపు :

దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకీ తమ అరేనా, నెక్సా పోర్ట్‌పోలియో కింద వచ్చే వివిధ మోడళ్లపై రూ.2,500 నుంచి గరిష్టంగా రూ.30,000 వరకు ధరలను పెంచింది. ముఖ్యంగా స్విఫ్ట్, బాలెనో, గ్రాండ్ విటారా, బ్రెజ్జా, ఎర్టిగా వంటి ప్రముఖ మోడళ్లపై మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి సుమారు రూ.5,000 నుంచి రూ.10,000 వరకు భారం పడనుంది. కమర్షియల్ వాహనాలైన సూపర్ క్యారీ, ఈకో ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి.

సెప్టెంబర్ నుంచి హ్యుందాయ్ కార్లు కూడా :

మరోవైపు దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా సైతం తన వాహనాల ధరలను పెంచేందుకు సిద్ధమైంది. వచ్చే సెప్టెంబర్ నుంచి దేశవ్యాప్తంగా తన మొత్తం పోర్ట్‌పోలియోపై గరిష్టంగా 1 శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు వెల్లడించింది. గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20, ఎక్స్టర్, వెన్యూ, క్రెటా వంటి పాపులర్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా ఈ పెంపు పరిధిలోకి రానున్నాయి. ఈ ఏడాదిలో హ్యుందాయ్ ధరలను పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

ఉక్కు, అల్యూమినియం వంటి ముడి పదార్థాల ధరల పెరుగుదల, అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అధిక నిర్వహణ వ్యయాలు వంటి అంశాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీలు స్పష్టం చేశాయి. కస్టమర్లపై భారాన్ని వీలైనంత వరకు తగ్గించేందుకు ప్రయత్నించినప్పటికీ, అనివార్య పరిస్థితుల వల్లే ధరల సవరణ చేపట్టినట్లు వెల్లడించాయి. పండుగ సీజన్‌కు ముందు ధరలు పెరగడం మధ్యతరగతి కార్ల కొనుగోలుదారులపై కొంత ఆర్థిక భారాన్ని మోపనుంది.

కేంద్ర మంత్రులకు సోషల్ మీడియా ర్యాంకులు.. టాప్‌లో మోదీ..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha