Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ICC: ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో అభిషేక్, వరుణ్ చక్రవర్తి

ICC: ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో అభిషేక్, వరుణ్ చక్రవర్తి

వార్త 4 months ago

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) (ICC) బుధవారం విడుదల చేసిన తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు మెరిశారు.. భారత ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, బౌలర్ల జాబితాలో వరుణ్ చక్రవర్తి నంబర్ వన్ స్థానం లో కొనసాగుతున్నాడు.

మరోవైపు, జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానానికి దూసుకొచ్చాడు.

T20WC: ఐర్లాండ్ పై ఆస్ట్రేలియా ఘన విజయం

ఇషాన్ కిషన్ కి 25వ ర్యాంకు

బ్యాటర్ల జాబితాలో అభిషేక్ శర్మ 909 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఇంగ్లండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్ (821), పాకిస్థాన్ ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్ (769) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగ ఒక స్థానం మెరుగుపరుచుకుని ఐదో ర్యాంకుకు చేరాడు. భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మూడు స్థానాలు ఎగబాకి 11వ ర్యాంకులో నిలిచాడు. భారత వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఏడు స్థానాలు ఎగబాకి 25వ ర్యాంకుకు చేరుకున్నాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha