Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
T20WC:  ఐర్లాండ్ పై ఆస్ట్రేలియా ఘన విజయం

T20WC: ఐర్లాండ్ పై ఆస్ట్రేలియా ఘన విజయం

వార్త 4 months ago

ICC టీ20 ప్రపంచ కప్‌ (T20WC) లో భాగంగా ఆస్ట్రేలియా, ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది . ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ (17 బంతుల్లో 37), మార్కస్ స్టోయినిస్ (29 బంతుల్లో 45), మాట్ రెన్‌షా (33 బంతుల్లో 37) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.

దీంతో ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌ ముందు 183 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

T20 World Cup 2026: ఉత్కంఠభరిత మ్యాచ్ లో సౌతాఫ్రికా విజయం

115 పరుగులకే ఆలౌట్

ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ రెండు వికెట్లు తీశాడు.183 పరుగుల లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి ఐరిష్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆ జట్టు 16.5 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌట్ అయింది. జార్జ్ డాక్రెల్ (41) ఒక్కడే కాస్త పోరాటపటిమ చూపాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్పిన్నర్ ఆడమ్ జంపా, పేసర్ నాథన్ ఎల్లిస్ చెరో 4 వికెట్లు తీసి ఐర్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. వీరిద్దరూ కలిసి కేవలం 35 పరుగులిచ్చి 8 వికెట్లు పంచుకుని ఆస్ట్రేలియాకు సునాయాస విజయాన్ని అందించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha