Pawan Kalyan visits ailing fan Niranjan : తన అశేష అభిమాన బలగంతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే పవన్ కళ్యాణ్, తాజాగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన వీరాభిమాని నిరంజన్‌ను కలిసి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ భేటీ నిరంజన్ జీవితంలో మర్చిపోలేని ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. నిరంజన్‌ను ఎంతో ఆప్యాయంగా పలకరించిన పవన్, అతనిలో ధైర్యాన్ని నింపేందుకు ఒక అద్భుతమైన హామీ ఇచ్చారు. “మనం ఇద్దరం కలిసి థియేటర్‌లో ‘OG’ సినిమా చూద్దాం.. ఒకవేళ ‘OG-2’ సినిమా గనుక తీస్తే, దానికి నువ్వే నా ప్రత్యేక అతిథివి (స్పెషల్ గెస్ట్)” అని పవన్ ప్రకటించడంతో నిరంజన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన అభిమాన హీరో చూపించిన ఈ ఆదరణకు, ప్రేమకు ఆ అభిమాని కళ్లల్లో ఆనందబాష్పాలు రాలాయి.
Read Also : విజయ్ దేవరకొండకు టీసీఏ లీగల్ నోటీసు.. ఎందుకు?

లంచ్ ఆఫర్, ఆటోగ్రాఫ్‌తో నిరంజన్‌ను ఆశీర్వదించిన పవన్ కళ్యాణ్
ఈ ప్రత్యేక ముఖాముఖి సందర్భంగా నిరంజన్ తన మనసులోని మరో కోరికను పవన్ ముందు ఉంచాడు. తనతో కలిసి భోజనం (లంచ్) చేయాలని కోరగా.. దానికి పవన్ ఏమాత్రం సంకోచించకుండా, తానే స్వయంగా నిరంజన్‌ను లంచ్‌కు తీసుకెళ్తానని మాట ఇచ్చారు. అంతేకాకుండా, నిరంజన్ తెచ్చిన ప్రత్యేక డైరీ, ఫొటోలపై పవన్ కళ్యాణ్ తన ఆటోగ్రాఫ్ ఇస్తూ.. “ప్రియమైన నిరంజన్ కి ప్రేమతో.. దుర్గమ్మ ఆశీస్సులతో చల్లగా ఉండాలి” అని మనస్ఫూర్తిగా రాసి ఆశీర్వదించారు. ఒక అగ్ర నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ, కష్టాల్లో ఉన్న తన అభిమాని కోసం సమయం కేటాయించి, అతనిలో జీవించేందుకు కొండంత భరోసా ఇచ్చిన పవన్ కళ్యాణ్ తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

