Jowar Purchase Center Medak: పెద్దశంకరపేట పట్టణ సమీపంలోని సబ్ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రంలో లారీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు బుధవారం ఆందోళనకు దిగారు.
మూడు రోజులుగా జొన్నల తరలింపు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also : Telangana Clean Energy Summit 2026: రేపే తెలంగాణ క్లీన్ ఎనర్జీ సమ్మిట్
Shortage of lorries at sorghum procurement center; farmers stage road blockade.
Jowar Purchase Center Medak: జాతీయ రహదారి 161పై నిరసన
ఈ నేపథ్యంలో ఆగ్రహించిన రైతులు జాతీయ రహదారి 161పై నిరసన చేపట్టారు. రోడ్డుపై తట్టు సంచులు కాల్చి కొంతసేపు రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే ఎస్సై ప్రవీణ్ రెడ్డి, ఏఎస్సై సంగమేశ్వర్, పోలీస్ సిబ్బంది, నేషనల్ హైవే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సంబంధిత పీఏసీఎస్ అధికారులతో చర్చించి లారీల కొరతను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అధికారుల హామీతో రైతులు తమ ఆందోళనను విరమించి రహదారిని ఖాళీ చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

