CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యర్థి పార్టీల వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వం ఎంతో కష్టపడి వేసిన రోడ్డును కొందరు ట్రాక్టర్‌తో దున్నేశారని, ఇది వారి ఉన్మాదానికి, పైశాచిక ఆనందానికి స్పష్టమైన నిదర్శనమని మండిపడ్డారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. "ఈరోజు టీవీలో చూశాను. మేం రోడ్లు వేస్తే, ఆ రోడ్డును ట్రాక్టర్‌తో దున్నేశారు. ఇది మా అభివృద్ధిని భరించలేక చేస్తున్నారా, లేక ఉన్మాదమో నాకు అర్థం కావడం లేదు" అని తీవ్ర సంతాపం, ఆగ్రహం వ్యక్తం చేశారు.
Electric Fishing Boat EV: కాకినాడలో ఈవీ బోట్ ట్రయల్ రన్ ప్రారంభించిన ఎమ్మెల్యే కొండబాబు!
'This is satanic joy?'.. Chandrababu's anger over the road vandalism incident
CM Chandrababu: జవాబుదారీ పాలన & ఐవీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్
ఓవైపు తాము రాష్ట్ర అభివృద్ధికి, జవాబుదారీతనంతో కూడిన పాలనకు ప్రాధాన్యమిస్తుంటే, మరోవైపు కొందరు కేవలం విధ్వంసానికే ప్రాధాన్యమిస్తున్నారని సీఎం విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రస్తుతం 55 రకాల సేవలను పారదర్శకంగా అందిస్తోందని తెలిపారు. ఆర్టీసీ బస్సులు, ఆసుపత్రులు, అన్నా క్యాంటీన్లు, రేషన్ షాపుల సేవలతో సహా ప్రతి అంశంపై ఐవీఆర్ఎస్ (IVRS), క్యూఆర్ (QR) కోడ్‌ల ద్వారా ప్రజల నుంచి నేరుగా ఫీడ్‌బ్యాక్ సేకరిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గ స్థాయి సమీక్షలలో అధికారుల ముందే వారి పనితీరు నివేదికలను చదివి వినిపిస్తున్నామని, తప్పు చేస్తే ఎంతటి వారైనా సహించేది లేదని స్పష్టం చేశారు.
గతంలో దెబ్బతిన్న 'బ్రాండ్ ఏపీ'ని తమ ప్రభుత్వం మళ్లీ నిలబెట్టిందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. గత రెండున్నరేళ్లలో రాష్ట్రానికి రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని, ఈ పెట్టుబడులన్నీ కార్యరూపం దాలిస్తే సుమారు 20 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అలాగే, రాబోయే రెండేళ్లలో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించే లక్ష్యంతో భారీ ప్రాజెక్టును ప్రారంభించినట్లు వెల్లడించారు. ఒకప్పుడు ఎడారిగా మారుతుందనే ఆందోళనలు వ్యక్తమైన రాయలసీమ ప్రాంతం, ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో 'రాయలసీమ రైజింగ్' దిశగా ముందుకు సాగుతోందని చంద్రబాబు పేర్కొన్నారు.
మెగా డీఎస్సీ అడ్డుకునేందుకు కోర్టులకు వెళ్లారు!
మెగా డీఎస్సీ (Mega DSC) విషయంలో ప్రతిపక్షాలు ప్రవర్తించిన తీరును చంద్రబాబు తీవ్రంగా తప్పుపట్టారు. "పేద నిరుద్యోగ పిల్లలకు ఉద్యోగాలు రాకుండా చేసేందుకు సుమారు 200 నుంచి 300 సార్లు కోర్టులకు వెళ్లి అడ్డుకోవాలని కుట్రలు చేశారు. మేం పట్టుబట్టి ఉద్యోగాలు ఇస్తే, మళ్ళీ మాపైనే ఆరోపణలు చేస్తున్నారు. నిజం నిప్పు లాంటిది.. దానితో ఆడుకుంటే మసైపోతారే తప్ప నిలవలేరు" అని గట్టిగా హెచ్చరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తేల్చిచెప్పారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com

