Electric Fishing Boat EV: దేశవ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ (EV) వాహనాల వినియోగం గణనీయంగా పెరిగింది. ఇప్పుడు ఈ సాంకేతికత రోడ్లకే పరిమితం కాకుండా, సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకూ అందుబాటులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్ పడవలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ పడవలను ప్రవేశపెట్టే దిశగా కీలక ముందడుగు పడింది. కాకినాడలో సముద్ర వేట కోసం ప్రాథమిక దశలో ఎలక్ట్రిక్ బోటును రంగంలోకి దించారు.
NH 65 Expansion Project: ఎన్‌హెచ్ 65 విస్తరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
MLA Kondababu started EV boat trial run in Kakinada
Electric Fishing Boat EV: కాకినాడలో ప్రారంభమైన ‘ఈవీ సాగరజ్యోతి’
‘సురాస్ వెంచర్స్ లిమిటెడ్’ అనే సంస్థ రూపొందించిన తొలి ఈవీ రెట్రోఫిటింగ్ మత్స్యకార పడవను కాకినాడ సముద్రంలోకి ప్రవేశపెట్టారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కుంభాభిషేకం చేపల రేవు వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొని ‘ఈవీ సాగరజ్యోతి’ పేరిట తయారుచేసిన ఈ బోటును లాంఛనంగా ప్రారంభించారు.
‘ఈవీ సాగరజ్యోతి’ బోటు ప్రత్యేకతలు
ఈ ఎలక్ట్రిక్ బోటును ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే సముద్రంలో ఐదు నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించి తిరిగి తీరానికి చేరుకోవచ్చు. సముద్రంలోని ఉప్పు గాలులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా దీనిని మన్నికగా రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా రోజూ ఉదయం చేపల వేటకు వెళ్లి సాయంత్రానికి తిరిగివచ్చే చిన్న పడవలు సుమారు 20 వేల వరకు ఉన్నాయి. వీటికి రోజుకు సగటున రూ.1,000 వరకు డీజిల్ ఖర్చవుతోంది. అదే ఎలక్ట్రిక్ బోట్లను వినియోగిస్తే ఇంధన వ్యయంలో 80 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. దీంతో మత్స్యకారులపై ఇంధన ఖర్చుల భారం తగ్గి, వారి ఆదాయానికి ప్రయోజనం చేకూరుతుంది.
మత్స్యకారులకు తప్పనున్న డీజిల్ ఇబ్బందులు
సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు డీజెల్ ధరలు భారంగా మారాయని, ఒక్కోసారి వేట మధ్యలో డీజిల్ సరిపోక సముద్రంలో చిక్కుకుపోయే ప్రమాదాలు కూడా ఎదురవుతున్నాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం చిన్న బోట్లలో ఛార్జింగ్ విధానం తీసుకొచ్చామని, భవిష్యత్తులో మరింత భారీ సామర్థ్యం ఉన్న ఛార్జింగ్ బోట్లను డిజైన్ చేయాలని ఆయన సూచించారు. ఈ బోట్లను కొనుగోలు చేసే మత్స్యకారులకు ప్రభుత్వ రాయితీలు (Subsidies) అందేలా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com

