Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇక హైదరాబాద్ రోడ్లపై టెస్లా కార్ల స్పీడ్ !

ఇక హైదరాబాద్ రోడ్లపై టెస్లా కార్ల స్పీడ్ !

వార్త 2 weeks ago

Tesla Cars : ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహనాల (EV) దిగ్గజం 'టెస్లా' (Tesla) భాగ్యనగరంలో అడుగుపెట్టింది. హైదరాబాద్ ఐటీ హబ్ అయిన మాదాపూర్ హైటెక్ సిటీలోని నాలెడ్జ్ సిటీలో కంపెనీ తన సరికొత్త 'ఎక్స్పీరియన్స్ సెంటర్' (Experience Center) ను అధికారికంగా ప్రారంభించింది.

భారతదేశంలో టెస్లాకు ఇది ఐదో షోరూమ్ కావడం విశేషం. ఈ కేంద్రాన్ని సందర్శించే వాహన ప్రియుల కోసం టెస్లా తన లేటెస్ట్ మోడల్స్ అయిన ‘2026 మోడల్ వై ప్రీమియం రియర్ వీల్ డ్రైవ్’ (Model Y Premium RWD) మరియు ఆరు సీట్ల ఆల్-వీల్ డ్రైవ్ ఎస్‌యూవీ ‘మోడల్ వై ఎల్’ (Model Y L) లను ప్రదర్శనకు ఉంచింది. అత్యాధునిక సాంకేతికత, గ్లోబల్ సేఫ్టీ రేటింగ్స్‌తో వస్తున్న ఈ కార్లను నేరుగా చూసి, టెస్లా అడ్వైజర్ల సమక్షంలో వాటి ఫీచర్లను తెలుసుకుని బుక్ చేసుకునే సదుపాయాన్ని కంపెనీ కల్పించింది.

Read Also : ఆండ్రాయిడ్ 17 తీసుకొచ్చిన టాప్-5 ఫీచర్లు ఇవే..క్రియేటర్స్‌కు ఇక తిరుగులేదు!

బొల్లారంలో సర్వీస్ సెంటర్.. జూలై నుంచి డెలివరీలు!

హైదరాబాద్‌లో కేవలం షోరూమ్‌కే పరిమితం కాకుండా, కస్టమర్లకు పూర్తి స్థాయి సేవలందించేందుకు టెస్లా పక్కా ప్లాన్‌తో ముందుకొచ్చింది. ఇందులో భాగంగానే నగర శివార్లలోని బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియాలో కార్ల డెలివరీ కేంద్రంతో పాటు, సేల్స్ తర్వాతి సేవల కోసం (After-sales services) అధునాతన వర్క్‌షాప్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈ ఎలక్ట్రిక్ కార్ల ప్రారంభ ధర రూ.50.89 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం కానుండగా, వీటికి సంబంధించిన డెలివరీలు జూలై 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. అంతేకాకుండా, జూన్ 30 లోపు కార్లను బుక్ చేసుకునే కస్టమర్లకు ఉచితంగా హోమ్ ఛార్జింగ్ వాల్ కనెక్టర్‌ను అందిస్తామని కంపెనీ ప్రకటించడంతో నగరంలోని ఎలక్ట్రిక్ కార్ల ప్రియుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha