Dailyhunt
ఇక హైస్పీడ్ రైల్వే కారిడార్లు!

ఇక హైస్పీడ్ రైల్వే కారిడార్లు!

వార్త 1 week ago

హైదరాబాద్ -పుణే - ముంబయి కారిడార్కు డిపిఆర్ పూర్తి: మంత్రి కోమటిరెడ్డి

High Speed Railway Corridor: రాష్ట్ర అభివృద్ధికి నాలుగు హైస్పీడ్ రైల్వే కారిడార్లను ఏర్పాటు చేస్తున్నామని భారత్ ప్యూచర్ సిటీ కేంద్రంగా ఇది ఉంటుందని రోడ్లు భవనాలశాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

హై స్పీడ్ రైల్వే కారిడార్లపై సోమవారం డా. బి. ఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సెక్రటేరియట్ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని పలువ్యూహాత్మక కారిడార్ల పురోగతిని సమగ్రంగా పరిశీ లించారు.

Read Also : 10th Result 2026 : రెండు రోజుల్లో పదో తరగతి ఫలితాలు ?

 High-speed railway corridors! DPR completed for Hyderabad-Pune-Mumbai corridor

High Speed Railway Corridor: మంత్రి కొమటిరెడ్డి మాట్లాడుతూ

ఈ సందర్భంగా మంత్రి కొమటిరెడ్డి మాట్లాడుతూ మూడు కారిడార్లు ఒకటి హైదరాబాద్ పూణే ముంబై కారిడార్ రెండవది భారత్ ఫ్యూచర్ సిటీ చెన్నై వయా అమరావతి కారిడార్ మూడవది భారత్ ఫ్యూచర్ సిటీ బెంగళూరు కారిడార్ లను హైస్పీడ్ కారిడార్లుగా తయారించడానికి ప్రతిపాదించామని చెప్పారు. హైదరాబాద్ – పూణే -ముంబాయి కారిడార్ దూరం 761కి. మీ గల మొత్తం స్టేషన్లు 12 అందులో 10ఎలివేటెడ్, 2 అండర్గ్రౌండ్ ఉండనున్నాయనీ వివరిం చారు. వికారాబాద్ దగ్గర 4.6 కి.మీ టన్నెల్ నిర్మించే అంశంపై ముఖ్యమంత్రి తో చర్చిస్తానని మంత్రి అధికారులతో అన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే నాన్ స్టాప్ గా 2 గంటల 55 నిమిషాల్లో చేరొచ్చని అధికారులు వివరించారు. 12 స్టేషన్లో ఆగితే గంటకు 330కి. మీ స్పీడ్ తో 3గంటల 21నిమిషాల్లో గమ్యస్థానం చేరుకునేలా ప్లాన్ చేసినట్టు తెలిపారు.

మరిన్ని వ్యూహాత్మక కారిడార్లు

భారత్ ఫ్యూచర్ సిటీ అమరావతి చెన్నై కారిడార్పై ప్రత్యేకంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సము ఖంగా ఉందని అధికారులు తెలి పారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున స్పెషల్ సిఎసి వికాస్ రాజ్, పలువురు అధికారులు ఈ ప్రాజెక్టులో సమ న్వయం చేసుకోవాలని సూచించా రు. భారత్ ఫ్యూచర్ సిటీ బెంగళూరు కారిడార్లో మన్ననూర్ సోమశిల ప్రాంతాలను కలుపుతూ కారిడార్ డిజైన్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. హై స్పీడ్ రైల్వేతో పాటు రాష్ట్రంలో కొనసాగుతున్న రోడ్లు, వంతెనలు, ఆర్వోబిలు, హైకోర్టు భవనం, టిమ్స్ హాస్పిటల్స్ వేగంగా చేయాలని కోరారు. పనులు సమయానికి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకో వాలని అధి కారులను ఆదేశించారు. జూన్2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సనత్నగర్ టిమ్స్ హాస్పిటల్స్ను ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్లు మంత్రి వెల్లడించారు.

వరంగల్ హాస్పిటల్ పనులపై ఆరా తీసిన మంత్రి

పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేలా టిమ్స్ ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు. మెడికల్ హెల్త్ శాఖతో సమన్వయం చేసుకొని అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులను స్పష్టంగా ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పనుల పురోగతిని తెలుసుకుని, రిపోర్ట్ తయారు చేయాలని స్పెషల్ సెక్రెటరీకి మంత్రి సూచించారు. వరంగల్ హాస్పిటల్ పనులపై ఆరా తీసిన మంత్రి పనుల పురోగతిపై అధికారుల బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించి వివరాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు.

నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పో రేషన్ లిమిటెడ్ అధికారి ఇందుధర శాస్త్రీ, సిపిఎం ముంబై యు.పి సింహా, రజనీష్ సరోజ్, ఆర్ బి స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ప్రత్యేక కార్యదర్శి ప్రావిణ్య, ఇఎన్సీలు మోహన్ నాయక్, జయభారతి, సిఇవనజతో పాటు పలువురు సీఈలు, రైల్వే అధికారులు, ఎన్ హెచ్ ఎస్ ఆర్ సిఎల్ హెచ్ ఎండీఏ రవీందర్ రెడ్డి, ఎంఏయూడీ, హెచ్ఎంఆర్ఎల్ సిపిఎం ఆనంద్ మోహన్, శ్రీనివాస్ రెడ్డి, బి.వి రావు, ధర్మారెడ్డి, రాజేందర్ పలువురు అధికారులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఎండ ప్రచండం.. రానున్న రెండు రోజుల్లో 47 డిగ్రీలకు చేరనున్నఉష్ణోగ్రతలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha