రాష్ట్రవ్యాప్తంగా హీట్వేవ్ హెచ్చరికలు
Telangana Heatwave: తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకి అసాధారణంగా పెరుగుతున్నాయి.
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు మించి నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. భానుడి ప్రతాపానికి ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయికి చేరు తుండడంతో జనం విలవిలలాడుతున్నారు.
Read Also : Theaters Strike in Telangana: మే 1 నుంచి థియేటర్ల మూసివేత
Maximum temperature in Adilabad was 45.2 degrees.
Telangana Heatwave: రెండు రోజుల్లో 47 డిగ్రీలకు చేరే అవకాశం
తాజాగా ఆదిలాబాద్లో అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై ఈ సీజన్లోనే అత్యంత వేడి రోజుగా నిలిచింది. అయితే రానున్న రెండు రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోందని, ఉష్ణోగ్రతలు ఏకంగా 47 డిగ్రీల మార్కునుతాకే ప్రమాదం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అసాధరణంగా పెరుగుతున్న ఎండ వేడిని పరిగణనలోనికి తీసుకున్న ఐఎండి, రాష్ట్ర వ్యాప్తంగా హీట్ వేవ్ హెచ్చరికలు జారి చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కొమరంభీమ్, నిర్మల్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాలకు అత్యంత ప్రమాదకరమైన రెడ్ అలెర్ట్ ను జారి చేసింది.
ఈ జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారి చేస్తూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా.. మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున బయటకు రావొద్దని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఒకవైపు ఎండలు మండిపోతున్నప్పటికీ స్థానికంగా ఏర్పడిన వాతావరణ మార్పుల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.
ఉత్తరాదిన మరింత పెరిగిన ఉష్ణోగ్రతలు
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో 43 డిగ్రీలు దాటాయి. దీనితో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఉత్తర, మధ్యభారతావనిలో వడగాడ్పులు తీవ్రత పెరిగింది. భారత వాతావరణ శాఖ అధికార వర్గాల ప్రకారం, సోమవారం దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో 46.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అమరావతి (మహారాష్ట్ర) లో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది. వాతావరణ శాఖ డేటా ప్రకారం, వార్దాలో 46.4 డిగ్రీలు, యవత్మాల్లో 46 డిగ్రీలు, నాగ్పూర్లో 45.4 డిగ్రీలు, చంద్రాపూర్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విదర్భప్రాంతంలో తీవ్రమైన వడగాలులు వీచాయని తెలిపింది. ఈ వారం మొత్తం దేశంలోని అనేక ప్రాంతాల్లో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సంవత్సరం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 నుంచి 46 డిగ్రీల వరకు చేరుకోవచ్చని, కొన్ని ప్రాంతాల్లో 47 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనా
రాబోయే 7 రోజులలో, ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, విదర్భలోని పలు ప్రాంతాలలో వడగాలుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని ఐఎమ్ విసృత అంచనా సూచిస్తోంది. అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్న సమయాల్లో బయటకు రాకూడదని అధికారులు సూచించారు.
దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతూ, సాధారణం కంటే అధిక పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో, భారత వాతావరణ శాఖ వడగాలుల మార్గదర్శకాలు, సలహాలను జారీ చేసింది. వాయువ్య, మధ్య, ద్వీపకల్ప భారతదేశం అంతటా గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 40 డిగ్రీల సెల్సియస్ నుండి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. అనేక ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువగా నమోదవుతున్నాయని, ఇది దేశంలోని కొన్ని ప్రాంతాలలో వడగాలి పరిస్థితి తీవ్రత తెలియజేస్తున్నదని పేర్కొంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

