Delhi Shopping Assistance: ఢిల్లీలోని లాజ్‌పత్ నగర్, సరోజినీ నగర్ ,చాంద్‌నీ చౌక్ వంటి ఐకానిక్ మార్కెట్లలో షాపింగ్ చేయడం ఎంత ఉత్సాహాన్ని ఇస్తుందో, శారీరకంగా అంతటి అలసటను కలిగిస్తుంది.
ఒక చేతిలో మూడు షాపింగ్ బ్యాగులు, మరో చేతిలో తినుబండారాల ప్యాకెట్లు, జేబులో నుండి జారిపోయే మొబైల్ ఫోన్, విపరీతమైన జనం మధ్య షాపింగ్ చేయడం ఒక పెద్ద యుద్ధమే. ఈ కష్టాలన్నింటికీ చెక్ పెడుతూ ఢిల్లీకి చెందిన ఇద్దరు స్థానిక యువకులు ఒక సరికొత్త స్టార్టప్‌ను స్టార్ట్ చేసారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి మార్కెట్లకు వెళ్లినప్పుడు అనుభవించిన వ్యక్తిగత కష్టాల నుండే 'క్యారీమెన్' షాపింగ్ అసిస్టెన్స్ సర్వీస్ అనే వినూత్న ఆలోచన పుట్టుకొచ్చింది.
"మీరు షాపింగ్ చేయండి.. మీ లగేజ్ మేము మోస్తాము" అనే నినాదంతో ప్రారంభమైన ఈ సర్వీస్ ధరలు కూడా చాలా అందుబాటులో ఉన్నాయి. కేవలం గంటకు 149 రూపాయల చొప్పున చెల్లిస్తే చాలు.. ఒక శిక్షణ పొందిన అసిస్టెంట్ (సహాయకుడు) మార్కెట్ అంతా మీ వెంటే ఉంటాడు. కస్టమర్ల సౌకర్యార్థం 2, 3 లేదా 4 గంటల ప్రత్యేక ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ అసిస్టెంట్ కేవలం షాపింగ్ బ్యాగులు మోయడమే కాకుండా, మార్కెట్ సందులలో దారి చూపించడం, ఫుడ్ కౌంటర్ల వద్ద క్యూలో నిలబడటం, షాపింగ్ ముగిసిన తర్వాత మెట్రో గేట్లు లేదా పార్కింగ్ ఏరియా వరకు మీ లగేజ్‌ను సురక్షితంగా తీసుకురావడం వంటి పనులన్నీ చూసుకుంటాడు.
Read Also : Modi Italy Tour: ఇటలీలో ప్రధాని మోదీకి అరుదైన గౌరవం: 'FAO అగ్రికోలా మెడల్' ప్రదానం
‘Carrymen’ startup launched in Delhi
Delhi Shopping Assistance: గర్భిణీలు, చిన్న పిల్లల తల్లులకు పెద్ద ఉపశమనం
ఈ సర్వీస్ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలతో వచ్చే తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. ఒక చేత్తో స్ట్రాలర్ పట్టుకుని, మరో చేత్తో భారీ బ్యాగులు మోయడం తల్లులకు చాలా కష్టం. అందుకే ఈ స్టార్టప్ అసిస్టెంట్‌తో పాటు అదనపు ఛార్జీతో ‘స్ట్రాలర్ రెంటల్’ సౌకర్యాన్ని కూడా మీకు అందిస్తోంది. షాపింగ్ కి వెళ్లినప్పుడు బ్యాగులు మోయలేక చచ్చే వేలాది మంది భర్తలకు, బాయ్‌ఫ్రెండ్స్‌కు, అలసిపోయే తల్లులకు ఈ సరికొత్త సర్వీస్ ఒక వరంలా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ సేవలను వృద్ధులు కూడా ఎక్కువగా బుక్ చేసుకుంటున్నారు. పెద్ద వయసు వారు బట్టలు, గృహోపకరణాలు కొనేటప్పుడు కాసేపు కూర్చోవడానికి చిన్న స్థలం, నీడను కోరుకుంటారు. కస్టమర్ల మనసెరిగిన క్యారీమెన్ బృందం వినూత్నంగా ఫోల్డబుల్ క్యాంపింగ్ చైర్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ సర్వీస్ లాజ్‌పత్ నగర్ మార్కెట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది, త్వరలోనే దీనిని చాంద్‌నీ చౌక్‌కు కూడా విస్తరించనున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
60 రోజుల్లో ఉద్యోగం దొరక్కపోతే అమెరికాను వీడాల్సిందే..టెకీలకు డెడ్‌లైన్

