Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇటలీలో ప్రధాని మోదీకి అరుదైన గౌరవం: 'FAO అగ్రికోలా మెడల్' ప్రదానం

ఇటలీలో ప్రధాని మోదీకి అరుదైన గౌరవం: 'FAO అగ్రికోలా మెడల్' ప్రదానం

వార్త 3 days ago

Modi Italy Tour: ఇటలీలో ప్రధాని మోదీకి అరుదైన గౌరవం: 'FAO అగ్రికోలా మెడల్' ప్రదానం ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ పర్యటన విజయవంతంగా ముగిసింది.

ఈ పర్యటనలో ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో ఒక అరుదైన గౌరవం దక్కడంతో పాటు, భారత్ - ఇటలీ దేశాల మధ్య రక్షణ, సాంకేతిక, సాంస్కృతిక రంగాలలో పలు చారిత్రక ఒప్పందాలు కుదిరాయి. ఇటలీ రాజధాని రోమ్‌లోని ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ (FAO) ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీకి 'అగ్రికోలా మెడల్-2026' బహుకరించారు. FAO డైరెక్టర్ జనరల్ క్వ్ డాంగ్యూ చేతుల మీదుగా మోదీ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. భారతదేశంలో ఆహార భద్రత, స్థిరమైన వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి గుర్తింపుగా దక్కిన ఈ అవార్డును ప్రధాని మోదీ దేశ రైతులు, పశుపోషకులు, మత్స్యకారులు మరియు వ్యవసాయ శాస్త్రవేత్తలకు అంకితం చేశారు.

Read Also: CJP Manifesto: కాక్రోచ్ జనతా పార్టీ సంచలన మేనిఫెస్టో..

 Modi Italy Tour

తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీ

గత 30 ఏళ్లలో FAO ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీ కావడం గమనార్హం."భారతీయ సంస్కృతిలో భూమిని తల్లిగా, రైతును భూమిపుత్రుడిగా భావిస్తారు. ఎక్కువ ఉత్పత్తి చేయడం మాత్రమే కాదు, మెరుగైన ఉత్పత్తి చేయడమే భవిష్యత్ వ్యవసాయం లక్ష్యం."
- ప్రధాని నరేంద్ర మోదీ

Modi Italy Tour: భారత వ్యవసాయ రంగంలో సాంకేతిక విప్లవం

గత పదేళ్లలో భారత్ దాదాపు 3,000 వాతావరణ అనుకూల పంట రకాలను అభివృద్ధి చేసిందని మోదీ వివరించారు. పర్ డ్రాప్ మోర్ క్రాప్, మైక్రో ఇరిగేషన్, సాయిల్ హెల్త్ కార్డులు, అగ్రిస్టాక్, మరియు AI ఆధారిత డ్రోన్ టెక్నాలజీల ద్వారా భారత వ్యవసాయాన్ని డేటా ఆధారితంగా మారుస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ వ్యవసాయ భూమిలో భారత్ వాటా కేవలం 2.5 శాతమే అయినప్పటికీ, ప్రపంచ జనాభాలో 18 శాతం మందికి ఆహార భద్రత కల్పిస్తూ ఎగుమతులను 51 బిలియన్ డాలర్లకు పెంచినట్లు వెల్లడించారు. ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడ్డాయి. విదేశాంగ శాఖ తెలిపిన వివరాల ప్రకారం కుదిరిన ముఖ్యమైన ఒప్పందాలు. 'భారత్-ఇటలీ డిఫెన్స్ ఇండస్ట్రీయల్ రోడ్‌మ్యాప్'పై ఒప్పందం కుదిరింది. రక్షణ పరికరాల సంయుక్త తయారీ, టెక్నాలజీ భాగస్వామ్యం చేపట్టనున్నారు. అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, ఇటలీకి చెందిన లియోనార్డో సంస్థల మధ్య హెలికాప్టర్లు, పైలట్ శిక్షణపై భాగస్వామ్యం కుదిరింది.

సంస్కృతి & పర్యాటకం: 2027వ సంవత్సరాన్ని 'భారత్-ఇటలీ సాంస్కృతిక సంవత్సరం'గా ప్రకటించారు. గుజరాత్‌లోని లోథల్ నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్‌లో ఇటలీ భాగస్వామ్యం వహించనుంది. భారత్ నుంచి ఇటలీకి నర్సుల రాకపోకలను సులభతరం చేసే సంయుక్త ప్రకటనపై సంతకాలు జరిగాయి. ప్రధాని మోదీ 50 మందికి పైగా అంతర్జాతీయ కంపెనీల CEOలతో సమావేశమయ్యారు. దీని ద్వారా సుమారు 40 బిలియన్ డాలర్ల పెట్టుబడి అవకాశాలు చర్చకు వచ్చాయి. భారత్-మధ్యప్రాచ్యం-యూరప్ ఆర్థిక కారిడార్ (IMEC) అమలుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

అమెరికాకు చైనా బిగ్ షాక్: ఎన్విడియాపై నిషేధంతో మొదలైన 'చిప్ వార్'!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha