Telangana: తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మార్కెట్లలో ప్లాస్టిక్ పూల (Plastic Flowers) అమ్మకాలను పూర్తిగా నిషేధిస్తూ మార్కెటింగ్ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.ఇక నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ మార్కెట్లలో ప్లాస్టిక్ పూలను విక్రయించకూడదని, ఎవరైనా అమ్మితే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించింది.
Read Also:Municipal Corporation New Building: కైత్లాపూర్‌లో రూ.200 కోట్లతో అత్యాధునిక భవనం
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ రైతు బజార్లు, ప్రభుత్వ మార్కెట్లలో ఈ నిషేధం అమల్లోకి తెచ్చింది. సహజ పూలను, వాటి ఉత్పత్తులను మాత్రమే రైతు బజార్లు, మార్కెట్లలో విక్రయించేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.
Telangana: ముఖ్యమైన అంశాలు
రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్లు, రైతు బజార్‌లలో సహజ పూలను పక్కన పెట్టి.. ఎక్కువగా ప్లాస్టిక్ పూలను అమ్ముతున్నారు. ఇటీవల వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు మేళాలకు హాజరయ్యారు. కొంతమంది రైతులు ఈ ప్లాస్టిక్ పూల విక్రయాల వల్ల సహజ పూల విక్రయాలు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్లాస్టిక్ పూల కారణంగా తాము నష్టపోతున్నామని మంత్రికి ఫిర్యాదు చేశారు.
Telangana Plastic Flower Ban
వెంటనే ఈ విషయంపై తుమ్మల నాగేశ్వరరావు స్పందించి.. మార్కెట్లలో ప్లాస్టిక్ పూల అమ్మకాలకు అనుమతించవద్దని ఆదేశించారు. మార్కెటింగ్‌శాఖ ప్లాస్టిక్ పూలపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ మాత్రమే కాదు.. మరికొన్ని రాష్ట్రాలు కూడా గతంలోనే ప్లాస్టిక్ పూల అమ్మకాలపై నిషేధం విధించాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

