Tandur Fake Cotton Seeds: తాండూర్ మండలంలోని బోయపల్లి బోర్డు వద్ద నకిలీ పత్తి విత్తనాలను పట్టుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు.
తాండూర్ పోలీస్ స్టేషన్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు డిసిపి వెల్లడించారు. బెల్లంపల్లి నుండి తాండూర్ కు నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్నారని పక్కా సమాచారం మేరకు తాండూర్ ఎస్సై ప్రసాద్, మండల వ్యవసాయ అధికారిణి కొండలే సుష్మ పోలీసు సిబ్బంది బుధవారం సాయంత్రం బోయపల్లి బోర్డ్ జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీలు నిర్వహించారు.
Read also: SriKalahasti Crime: ఈత సరదా తెచ్చిన ముప్పు.. లోతైన బావిలో మునిగి ఇద్దరు మృత్యువాత!

Seized fake seeds bags with police
Tandur Fake Cotton Seeds: ఆటోలో 150 కేజీల విత్తనాల లభ్యం
బెల్లంపల్లి వైపు నుంచి వస్తున్న ఒక ఆటోను తనిఖీ చేయగా 150 కేజీల నకిలీ పత్తి విత్తనాలు లభ్యమయ్యాయి. భీమిని మండలం నారాయణపూర్ ఎస్సీ కాలనీలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పని చేస్తూ బోయపల్లి బోర్డు వద్ద నివాసం ఉంటున్న పూస సుబ్బారావ్, తాండూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఒగరి సమ్మయ్య, తాండూర్ కు చెందిన ఆటో డ్రైవరు మగ్దూంలను పోలీసులు అదుపులోకి తీసుకుని, నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను విచారించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాకు చెందిన గుంటుపల్లి శ్రీనివాస్ వద్ద నకిలీ పత్తి విత్తనాలు కొనుగోలు చేసినట్లు డిసిపి తెలిపారు. సూత్రధారి శ్రీనివాస్ పరారీలో ఉన్నట్లు డిసిపి తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

