Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇక ప్రభుత్వ పాఠశాలల్లోనే ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు!

ఇక ప్రభుత్వ పాఠశాలల్లోనే ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు!

వార్త 2 months ago

Telangana Education: తెలంగాణ విద్యావ్యవస్థలో సరికొత్త మార్పులు మొదలుకాబోతున్నాయి. అట్టడుగు వర్గాల పిల్లలకు సైతం కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 'ప్రీ-ప్రైమరీ' (పూర్వ ప్రాథమిక) విద్యను బలోపేతం చేస్తోంది.

ప్రైవేటు స్కూళ్లకు వెళ్లలేని పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలల్లోనే ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను అందుబాటులోకి తెస్తూ విప్లవాత్మక అడుగులు వేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుంచి రాష్ట్రవ్యాప్తంగా అదనంగా 3,000 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విధానాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇప్పటికే 1,362 పాఠశాలల్లో విజయవంతంగా నడుస్తున్న ప్రీ-ప్రైమరీ విధానాన్ని ఇప్పుడు మరింత విస్తరిస్తున్నారు. బడ్జెట్ అంచనాలను మించి సుమారు 3,000 పాఠశాలల్లో యూకేజీ తరగతులను ప్రారంభించేందుకు విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారుల (DEO) నివేదికల ఆధారంగా త్వరలోనే ఆయా పాఠశాలల జాబితాను ఖరారు చేయనున్నారు. రాష్ట్రంలోని 12,700 గ్రామ పంచాయతీల్లో ప్రతి పంచాయతీకి కనీసం ఒక పాఠశాలనైనా ప్రీ-ప్రైమరీ కేంద్రంగా మార్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

Read Also: CP Sajjanar: గ్యాడ్జెట్లకు బానిసలు కావొద్దు.. సెలవులను ఎంజాయ్ చేయండి!

 Pre-primary education in Telangana government schools

Telangana Education: ఉపాధి అవకాశాలు, ప్రత్యేక నిధులు

ఈ విధానం అమలు కోసం చిన్నారుల సంరక్షణకు ఆయాలను, ప్రత్యేక ఇన్‌స్ట్రక్టర్లను ప్రభుత్వం నియమిస్తోంది. వీరికి సమగ్ర శిక్షా ప్రాజెక్టు నిధుల ద్వారా గౌరవ వేతనాలు (ఆయాకు ₹6,000, ఇన్‌స్ట్రక్టర్‌కు ₹8,000) అందజేస్తున్నారు. తాజా విస్తరణ నిర్ణయంతో మరో 6,000 మందికి ఉపాధి లభించనుంది. అంతేకాకుండా, హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ లోపల ఎంపిక చేసిన 28 ప్రాంతాల్లో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే చోట విద్యనందించేలా ఇప్పటికే జీఓ జారీ అయింది. ప్రభుత్వ బడుల్లోనూ నర్సరీ, ఎల్‌కేజీలను పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టాలన్న విజ్ఞప్తులను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోంది. దీనివల్ల మధ్యతరగతి, పేద వర్గాల పిల్లలకు చిన్నతనం నుంచే బలమైన విద్యా పునాది లభిస్తుందని విద్యావేత్తలు భావిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్.. ఏప్రిల్ 15 వరకు దరఖాస్తుకు ఛాన్స్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha