Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇకపై ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా!

ఇకపై ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా!

వార్త 2 weeks ago

PF Withdrawal: కోట్లాది మంది ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తీపి కబురు అందించింది. పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవడాన్ని మరింత సరళతరం చేస్తూ 'EPFO 3.0' వ్యవస్థను అమలు చేస్తోంది.

దీని ద్వారా సబ్‌స్క్రైబర్లు తమ పీఎఫ్ ఖాతాలోని నగదును ఏటీఎం కార్డు లేదా యూపీఐ (UPI) ద్వారా నేరుగా పొందే వెసులుబాటు కలగనుంది.

Read Also : Gold Rate Today : ఇరాన్ ఉద్రిక్తతలతో ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు

 PF money can now be withdrawn through ATMs!

PF Withdrawal: 50 శాతం వరకు తక్షణ విత్‌డ్రా

ప్రస్తుతం పీఎఫ్ డబ్బులు చేతికి అందాలంటే కనీసం వారం నుండి పది రోజుల సమయం పడుతోంది. అయితే, కొత్తగా రాబోతున్న ఫీచర్‌తో సబ్‌స్క్రైబర్లు తమ మొత్తం బ్యాలెన్స్‌లో గరిష్టంగా 50 శాతం వరకు ఏటీఎం లేదా యూపీఐ ద్వారా తక్షణమే విత్‌డ్రా చేసుకోవచ్చు. అత్యవసర వైద్య ఖర్చులు లేదా ఇతర అవసరాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే ఈ నగదు అందుతుంది.

పీఎఫ్ ఏటీఎం కార్డులు.. యూపీఐ లింక్

సభ్యుల కోసం ప్రత్యేకంగా డెడికేటెడ్ ఏటీఎం కార్డులను జారీ చేయాలని ఈపీఎఫ్ఓ యోచిస్తోంది. ఇవి నేరుగా సభ్యుల పీఎఫ్ ఖాతాలకు లింక్ చేయబడతాయి. అలాగే, మీ యూఏఎన్ (UAN) కు అనుసంధానించబడిన బ్యాంక్ అకౌంట్ ద్వారా యూపీఐ సేవలను ఉపయోగించుకునేలా సాఫ్ట్‌వేర్ మార్పులు చేస్తున్నారు. మే నెలాఖరు నాటికి ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

ఇవి ఉంటేనే అర్హత:

ఈ డిజిటల్ సేవలను పొందాలంటే సభ్యులకు కింది అర్హతలు తప్పనిసరి:

  • ఖాతాదారుడికి యాక్టివ్ UAN ఉండాలి.
  • కేవైసీ (KYC) ప్రక్రియ పూర్తి చేసి ఉండాలి.
  • పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ పీఎఫ్ ఖాతాతో లింక్ అయి ఉండాలి.

రికార్డు స్థాయిలో క్లెయిమ్‌ల పరిష్కారం

కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించిన గణాంకాల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ రికార్డు స్థాయిలో 8.31 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించింది. ఇందులో 71 శాతం అడ్వాన్స్ క్లెయిమ్‌లను కేవలం మూడు రోజుల్లోనే ఆటో-మోడ్ ద్వారా క్లియర్ చేయడం విశేషం. అంతేకాకుండా, 1.59 కోట్ల మంది సభ్యులు తమ యజమాని ప్రమేయం లేకుండానే బ్యాంక్ వివరాలను అప్‌డేట్ చేసుకునే వెసులుబాటును వినియోగించుకున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

నోయిడాలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన అడోబ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha