Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇరాన్ ఉద్రిక్తతలతో ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు

ఇరాన్ ఉద్రిక్తతలతో ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు

వార్త 2 weeks ago

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు

Gold Rate Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి షాక్ తగిలింది. గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు ఈరోజు ఒక్కసారిగా భారీగా పెరిగాయి.

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం పడింది.

ఇరాన్ యూఏఈ లక్ష్యంగా దాడులు చేయడం, అమెరికా నౌకలపై దాడులు జరిగినట్లు వార్తలు రావడంతో గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది. దీనితో పెట్టుబడిదారులు మళ్లీ బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ జంప్

అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు దాదాపు 100 డాలర్లు పెరిగింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు 4650 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అలాగే స్పాట్ సిల్వర్ ధర కూడా 3.58 శాతం పెరిగి ఔన్సుకు 75.72 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ప్రపంచ మార్కెట్లలో పెరిగిన ఉద్రిక్తతలు బులియన్ మార్కెట్‌పై నేరుగా ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Read Also:Tamilnadu Results: ఎన్నికల్లో ధనస్వామ్యం ఓడి ప్రజాస్వామ్యం గెలిచింది - విజయ్

 Gold Rate Today

హైదరాబాద్‌లో తాజా బంగారం ధరలు

హైదరాబాద్‌ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.2130 పెరిగింది. దీంతో తులం బంగారం ధర రూ.1,51,310 వద్దకు చేరుకుంది.cఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 10 గ్రాములకు రూ.1950 పెరిగి ప్రస్తుతం రూ.1,38,700 వద్ద కొనసాగుతోంది.

వెండి ధర కూడా భారీ పెరుగుదల

బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా పెరిగింది. గత రోజు రూ.5000 తగ్గిన వెండి రేటు ఈరోజు మళ్లీ అదే స్థాయిలో పెరిగింది.cదీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,70,000 మార్క్ వద్ద కొనసాగుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

టీవీకే ఎమ్మెల్యేగా తెలుగు మహిళా సంచలనం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha