Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇకపై ఒకే టికెట్‌తో మెట్రో, ఆర్టీసీలో ప్రయాణం

ఇకపై ఒకే టికెట్‌తో మెట్రో, ఆర్టీసీలో ప్రయాణం

వార్త 6 days ago

Hyderabad Metro-TGSRTC Single Ticket: హైదరాబాద్ నగరంలోని ప్రజా రవాణాను మరింత సులభతరం చేసి, ప్రయాణికులకు మెరుగైన సేవలందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.

నగరంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెట్రో రైలు, టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) బస్సుల్లో ఒకే టికెట్‌తో ప్రయాణించే వెసులుబాటును అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సంజయ్ జాజూ అధ్యక్షతన ఇటీవల జరిగిన హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) బోర్డు సమావేశంలో ఈ కీలక ప్రతిపాదనపై చర్చించారు.

Read Also : Green Field Highway : నేటి నుంచే సూర్యాపేట-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభం

 Travel on Metro and RTC with a single ticket from now on.

Hyderabad Metro-TGSRTC Single Ticket: 'కామన్ మొబిలిటీ టికెటింగ్' విధానం (Single Ticket System)

ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో మరియు ఆర్టీసీ సేవలను అనుసంధానిస్తూ 'కామన్ మొబిలిటీ టికెటింగ్' (ఒకే టికెట్ విధానం) ని రూపొందించాలని సీఎస్ సంజయ్ జాజూ అధికారులను ఆదేశించారు.

  • ఉమ్మడి యాప్ (Common App): మెట్రో, ఆర్టీసీ ప్రయాణికులందరికీ ఒకే చోట టికెట్ బుకింగ్ సదుపాయం లభించేలా ఒక ప్రత్యేకమైన ఉమ్మడి మొబైల్ అప్లికేషన్‌ను (Mobile App) అభివృద్ధి చేయాలని టీజీఎస్ఆర్టీసీ అధికారులతో సంప్రదింపులు జరపాలని ఆయన సూచించారు.

రోజువారీ, నెలవారీ మెట్రో పాస్‌లు!

ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించడంతో పాటు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు మెట్రోలో ప్రత్యేక పాస్‌లను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.

  • మెట్రో ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా రోజువారీ (Daily Pass), వారపు (Weekly Pass),నెలవారీ ట్రావెల్ పాస్‌లనుMonthly Pass ప్రవేశపెట్టే అవకాశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సీఎస్ అధికారులను కోరారు.

అదనపు మెట్రో కోచ్‌లు & ఫేజ్-2 పురోగతి

హైదరాబాద్‌లో మెట్రో నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, రద్దీకి తగినట్లుగా ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు అదనపు మెట్రో కోచ్‌ల కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీఎస్ స్పష్టం చేశారు.

అలాగే ఈ కీలక సమావేశంలో నగరవ్యాప్తంగా ప్రతిపాదించిన మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, నిధులు మరియు ఇతర నిర్మాణ పనుల పురోగతిని కూడా ఉన్నతాధికారులు సమీక్షించారు. ఈ ఒకే టికెట్ విధానం అమల్లోకి వస్తే నగరవాసులకు ప్రయాణ వేళల్లో సమయం ఆదా అవ్వడమే కాకుండా రవాణా కష్టాలు చాలావరకు తీరనున్నాయి.

ఖమ్మం-దేవరపల్లి గ్రీన్​ఫీల్డ్​ హైవే మరో వారంలో అందుబాటు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha