Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఖమ్మం-దేవరపల్లి గ్రీన్​ఫీల్డ్​ హైవే మరో వారంలో అందుబాటు

ఖమ్మం-దేవరపల్లి గ్రీన్​ఫీల్డ్​ హైవే మరో వారంలో అందుబాటు

వార్త 6 days ago

Khammam to Devarapalli greenfield highway : రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానిస్తూ ఖమ్మం నుంచి దేవరపల్లి మధ్య నిర్మించిన తొలి యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే (ఎన్‌హెచ్‌-365 బీజీ) మరో వారం రోజుల్లోనే పూర్తి స్థాయిగా అందుబాటులోకి రానుంది.

దీనికి సంబంధించి ఇది వరకే రోడ్లు, వంతెనల నిర్మాణం పూర్తయినప్పటికీ, ధ్వంసలాపురం సమీపంలోని రైల్వే ట్రాక్‌పై రోడ్​ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)ల పనులు నెమ్మదించాయి. దీంతో కొంతకాలంగా వైరా నుంచి దేవరపల్లి వరకు టోల్‌ప్లాజాలను తెరచి రవాణాకు అనుమతించారు. తాజాగా ఎడమ వైపు ఆర్వోబీ నిర్మాణం పూర్తవడంతో దాని మీదుగా రాకపోకలు కొనసాగించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Read Also: Modi : నేడు ఏపీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం

 Khammam to Devarapalli greenfield highway

Khammam to Devarapalli greenfield highway : టోల్​ ట్యాక్స్​ వసూలు చేయరు

సూర్యాపేట నుంచి వచ్చే వాహనాలు ఖమ్మం జిల్లాలోకి రాగానే తెల్దారుపల్లి దగ్గర ఉన్న టోల్​గేట్​ ద్వారా గ్రీన్​ ఫీల్డ్​ హైవేపైకి ప్రవేశిస్తాయి. చివరగా దేవరపల్లి సమీపంలో నిష్క్రమణ (ఎగ్జిట్​) గేటు నుంచి దిగుతాయి. ఖమ్మం నుంచి దేవరపల్లి మధ్యలో ఉండే ప్రధాన పట్టణాల దగ్గర హైవే కింద మరో తొమ్మిది టోల్​ ప్లాజాల నుంచి కూడా గ్రీన్​ ఫీల్డ్​ హైవేపైకి ఎంట్రీ, ఎగ్జిట్​ కావచ్చు. ఈ గ్రీన్ ​ఫీల్డ్​పై సాధారణ హైవేల మాదిరిగా టోల్​ ట్యాక్స్​ వసూలు చేయరు. వాహనం ప్రవేశం నుంచి నిష్క్రమణ వరకు ఉండే దూరాన్ని బట్టి మాత్రమే వసూలు చేస్తారు. ఉదాహరణకు ఓఆర్​ఆర్​ తరహాలో ఉంటుంది.హైవే పొడవునా ప్రతి కిలోమీటరుకు ఒక సీసీ కెమెరాను అమర్చారు. వందనం, చౌడవరం సమీపంలో భారీ గూడ్స్​ వాహనాలు నిలిపేలా ట్రక్​ లే బైలు కూడా ఏర్పాటు చేశారు.ఈ హైవేకు అమరావతి నుంచి నాగ్​పూర్​ వెళ్లే మరో గ్రీన్​ ఫీల్డ్​ హైవే వందనం-కొదుమూరు దగ్గర అనుసంధానమవుతుంది.

నెల్లూరులో సిఐటియు భారీ ధర్నా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha