Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇకపై ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లకు టెట్ తప్పనిసరి

ఇకపై ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లకు టెట్ తప్పనిసరి

వార్త 1 week ago

AP Teacher Promotions New Rules: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఉపాధ్యాయులకు సంబంధించి రెండు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఒకవైపు పదోన్నతుల విషయంలో నిబంధనలను కఠినతరం చేస్తూనే, మరోవైపు ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపునిచ్చేలా విదేశీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Read Also : CM Chandrababu Naidu: వర్క్ ఫ్రమ్ హోమ్ దిశగా సీఎం చంద్రబాబు అడుగులు

 AP Education Department’s key decision.. TET mandatory for promotions.

AP Teacher Promotions New Rules: పదోన్నతులకు ‘టెట్’ తప్పనిసరి

పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం, ఇకపై ఉపాధ్యాయుల ప్రమోషన్లలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) అర్హత తప్పనిసరి. స్కూల్ అసిస్టెంట్, గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయుల పదోన్నతులు పొందే వారు ఖచ్చితంగా టెట్ పాస్ అయి ఉండాలి. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (NCTE) మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈ మార్పులు చేశారు. ఇకపై ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ల సీనియారిటీ లిస్టులో టెట్ మార్కులు, అర్హత పొందిన పేపర్ వంటి వివరాల కోసం ప్రత్యేక కాలమ్‌ను చేర్చనున్నారు. 1 నుండి 8వ తరగతి వరకు బోధించే ప్రతి టీచర్, సర్వీసులో ఎప్పుడు చేరినప్పటికీ ప్రమోషన్ కావాలంటే టెట్ క్వాలిఫై కావాల్సిందే.

విదేశీ పర్యటనకు 31 మంది ఉత్తమ ఉపాధ్యాయులు

విద్యా రంగంలో అంతర్జాతీయ బోధనా పద్ధతులను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన 31 మంది టీచర్లను, మరికొందరు అధికారులను ప్రభుత్వ ఖర్చులతో ఫిన్లాండ్ పంపనుంది. ఆగస్టు 17 నుండి 26 వరకు ఈ బృందం ఫిన్లాండ్‌లో పర్యటిస్తుంది.

ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా విధానం కలిగిన దేశాల్లో ఒకటిగా పేరున్న ఫిన్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టుర్కును వీరు సందర్శిస్తారు. అక్కడి ప్రాథమిక విద్యా బోధన పద్ధతులను పరిశీలిస్తారు. పర్యటన ముగిసిన వారం రోజుల్లోగా, అక్కడి విద్యా విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏ విధంగా అమలు చేయవచ్చో వివరిస్తూ ఒక సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. విద్యా ప్రమాణాలను పెంచడంలో భాగంగా తీసుకున్న ఈ రెండు నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్ర విద్యా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha