Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వర్క్ ఫ్రమ్ హోమ్ దిశగా సీఎం చంద్రబాబు అడుగులు

వర్క్ ఫ్రమ్ హోమ్ దిశగా సీఎం చంద్రబాబు అడుగులు

వార్త 3 months ago

CM Chandrababu Naidu: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు సూచనలు చేసిన విషయం తెలిసిందే. పెరుగుతున్న ఇంధన ధరలు, ఆర్థిక ఒత్తిడినిఅధిగమించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటించారు.

దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని సూచించిన పొదుపు చర్యలను ఏపీలోనూ అమలు చేస్తామని ఆయన వెల్లడించారు.

Read Also: Visakhapatnam road accident: నిలిపి ఉంచిన లారీని ఢీకొన్న వ్యాన్.. చికిత్స పొందుతూ వ్యక్తి మరణం

CM Chandrababu Naidu: ప్రభుత్వ కార్యకలాపాల్లో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (WFH)

అమరావతిలోని నిడమర్రులో కిమ్స్ (KIMS) ఆసుపత్రి, వైద్య విశ్వవిద్యాలయానికి భూమి పూజ చేసిన సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.ఇంధన ఆదాతో పాటు ట్రాఫిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ప్రోత్సహిస్తామని చెప్పారు.

 Chandrababu Naidu on PM Modi Savings Tips

సోలార్ ఎనర్జీ (సౌర శక్తి) వాడకాన్ని పెంచడం, స్థానిక పర్యాటకాన్ని (Domestic Tourism) ప్రోత్సహించడం వంటి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.విదేశీ ప్రయాణాలు తగ్గించి, స్వదేశీ వస్తువుల వాడకాన్ని పెంచాలని ప్రధాని చేసిన సూచనలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

అక్రమ సంబంధానికి అడ్డువస్తుందని అత్తను చంపిన కోడలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha