Dailyhunt
ఇకపై విడి నూనె అమ్మితే జైలుకే

ఇకపై విడి నూనె అమ్మితే జైలుకే

వార్త 1 week ago

Hyderabad: హైదరాబాద్ నగరంలో వినియోగదారుల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా H-Fast (Hyderabad Food Analysis and Surveillance Team) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

నగరంలో కల్తీ నూనె విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు విడి నూనె (Loose Oil) అమ్మకాలపై కఠిన ఆంక్షలు విధించారు.

Read Also:Farmer Suicide Medak District:సాగు నీరు లేక పంట ఎండిపోయిందని ఆవేదనతో రైతు ఆత్మహత్య

15 రోజుల గడువు.. ఆ తర్వాత కఠిన చర్యలు

నగరంలోని కిరాణా షాపులు, హోల్‌సేల్ మార్కెట్లలో విడి నూనె అమ్మకాలను నిలిపివేయడానికి అధికారులు 15 రోజుల గడువు ఇచ్చారు. ఈ గడువు ముగిసిన తర్వాత కూడా ఎవరైనా విడి నూనె విక్రయిస్తే వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Hyderabad: ప్యాకేజింగ్ మరియు లేబులింగ్ తప్పనిసరి

వినియోగదారులు కొనే ప్రతి నూనె ప్యాకెట్ నాణ్యతతో ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. విక్రయించే నూనె ప్యాకెట్లపై కింది వివరాలు తప్పనిసరిగా ఉండాలి.నూనె ప్యాకెట్ లేదా డబ్బా పూర్తిగా సీల్ చేసి ఉండాలి.తయారీ తేదీ (Manufacturing Date), ఎక్స్‌పైరీ తేదీ, బ్యాచ్ నంబర్ స్పష్టంగా ఉండాలి.ప్రభుత్వం గుర్తించిన FSSAI లైసెన్స్ మార్కు తప్పనిసరి.

 Hyderabad Loose Oil Ban

రిఫైనరీలు, నిల్వ కేంద్రాల్లో పరిశుభ్రత నిబంధనలు తప్పనిసరిగా ఫాలో అవ్వాలని పోలీసులు సూచించారు. తక్కువ ధరకు విడి నూనె కొనొద్దని, కల్తీ నూనె దొరికితే లైసెన్స్ రద్దుతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తామని తెలిపారు.రిఫైనరీలు, నిల్వ కేంద్రాల్లో పరిశుభ్రత నిబంధనలు తప్పనిసరిగా ఫాలో అవ్వాలని సూచించారు. తక్కువ ధరకు విడి నూనె కొనొద్దని ప్రజలకు సూచించారు పోలీసులు.

కల్తీ నూనెలు వాడటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, లివర్ సమస్యలు, గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి ప్రమాదకర ప్రాణాంతక వ్యాధులు బారిన పడే ప్రమాదం ఉంటుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న చౌటుకూరు మండల కేంద్రం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha