Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయండి-సీఎం చంద్రబాబు ఆదేశాలు

ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయండి-సీఎం చంద్రబాబు ఆదేశాలు

వార్త 2 months ago

ప్రభుత్వ పథకాలపై సీఎం సమీక్ష

CM Chandrababu : ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న పథకాలను వేగంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సమర్థంగా అందినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు.

ఇళ్ల నిర్మాణంపై కీలక ఆదేశాలు

ఈ ఏడాది మరోసారి సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. టిడ్కో ఇళ్లతో పాటు మరో 5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని అధికారులకు ఆదేశించారు. అలాగే ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్న వారికి త్వరగా స్థలాలు కేటాయించాలని చెప్పారు.

Read Also: KKR vs PBKS Match : ఇరు జట్లకు ఒక్కో పాయింట్

 CM Chandrababu

కాలేజీ విద్యలో సంస్కరణలు

రాష్ట్రంలో కాలేజీ విద్యను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్చాలని చంద్రబాబు అన్నారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టేలా కరిక్యులమ్‌ను పునర్వ్యవస్థీకరించాలని అధికారులను ఆదేశించారు. యూనివర్సిటీల ర్యాంకింగులు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

యార్కర్ కింగ్ పథిరన వచ్చేది అప్పుడేనా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha