Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్ రెండో వివాహం

ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్ రెండో వివాహం

వార్త 2 weeks ago

Jemima Goldsmith: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్ మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 52 ఏళ్ల జెమీమా.. ఐరిష్-ఆస్ట్రేలియా వ్యాపారవేత్త కామెరాన్ ఓ'రెయిల్లీని వివాహం చేసుకున్నారు.

సెప్టెంబర్ రెండో వారంలో ఈ వివాహం జరిగినట్లు సమాచారం. తాజాగా జెమీమా కుటుంబ సభ్యులు పెళ్లికి సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు.

Read Also :Iran-America War : అమెరికాతో తక్షణమే దౌత్య చర్చలు జరిపే ప్రసక్తే లేదు : ఇరాన్

ఇమ్రాన్ ఖాన్‌తో 2004లో విడాకులు

జెమీమా గోల్డ్‌స్మిత్, ఇమ్రాన్ ఖాన్ 1995లో వివాహం చేసుకున్నారు. దాదాపు తొమ్మిదేళ్ల వైవాహిక జీవితం అనంతరం 2004లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. వీరికి సులేమాన్, కాసిం అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. విడాకుల తర్వాత కూడా పిల్లల విషయంలో ఇద్దరూ తమ బాధ్యతలను కొనసాగించారు.

Jemima Goldsmith: జెమీమా గోల్డ్‌స్మిత్ ఎవరు?

జెమీమా గోల్డ్‌స్మిత్ ఫిల్మ్ మేకర్‌గా, రచయిత్రిగా గుర్తింపు పొందారు. అంతేకాకుండా మానవ హక్కుల అంశాలపై కూడా ఆమె పనిచేస్తున్నారు. మీడియా, సామాజిక అంశాలపై ఆమెకు మంచి పరిచయం ఉంది. తాజాగా కామెరాన్ ఓ’రెయిల్లీతో ఆమె వివాహం చేసుకున్న విషయం బయటకు రావడంతో ఈ వార్త అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. కుటుంబం విడుదల చేసిన వివాహ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

ట్రంప్‌ కుమారుడి వివాహ వేడుకలు: రష్యా కుబేరుడి ఆర్థిక సాయంపై వివాదం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha