Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IND vs NAM: వరుణ్ చక్రవర్తి వల్లే ఓడిపోయాం: నమీబియా కెప్టెన్

IND vs NAM: వరుణ్ చక్రవర్తి వల్లే ఓడిపోయాం: నమీబియా కెప్టెన్

వార్త 4 months ago

టీ20 వరల్డ్‌కప్‌-2026లో నమీబియా జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన కీలక మ్యాచ్‌లో టీమిండియా (IND vs NAM) చేతిలో నమీబియా 93 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయింది.

ఈ ఓటమితో నమీబియా సెమీఫైనల్ అవకాశాలు దాదాపు సంక్లిష్టంగా మారాయి. మ్యాచ్ అనంతరం నమీబియా కెప్టెన్ గెర్హాడ్ ఎరాస్మస్ మీడియాతో మాట్లాడుతూ తమ ఓటమికి ప్రధాన కారణం భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అని స్పష్టంగా పేర్కొన్నాడు.

IPL 2026: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రియాన్ పరాగ్

'ఇది చాలా చిన్న గ్రౌండ్. రెండో ఇన్నింగ్స్‌లో డ్యూ ప్రభావంతో స్పిన్నర్లకు బౌలింగ్ చేయడం కష్టమవుతుందని భావించాను. 26 ఓవర్ల తర్వాత మాకు గెలిచే అవకాశాలు ఉంటాయని ఆశించాను. కానీ దురదృష్టవశాత్తు వరుణ్ చక్రవర్తీ తన రెండో ఓవర్ల స్పెల్‌తో మా పతనాన్ని శాసించాడు.స్మిత్ పవర్ ప్లే తర్వాత తిరిగి వచ్చి డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసిన విధానం అద్భుతం. ఇలాంటి నైపుణ్యం కలిగిన ఆటగాళ్లు ఉండాలని మేం కోరుకుంటున్నాం.

స్లో పిచ్ మాకు బాగా సరిపోతుంది

పెద్ద జట్లతో పోటీ పడాలంటే మా ఇన్నింగ్స్ ఆరంభం, ముగింపు బాగుండాలి. మా బ్యాటింగ్ ప్రమాణాలను ఆ దిశగా పెంచుకోవాలి. చెన్నైలోని స్లో పిచ్ మాకు బాగా సరిపోతుందని నేను భావిస్తున్నా. ఇంకా మేం చూపించాల్సింది చాలా ఉంది. మేం ఇంకా 100 శాతం సామర్థ్యంతో ఆడటం లేదు. ఈ పర్యటనలో అత్యుత్తమ ప్రదర్శన చేయాలని భావిస్తున్నాం. మా బ్యాటింగ్‌లో చాలా పవర్ ఉంది.

కానీ ఆ పవర్‌ను చూపించడానికి అవసరమైన పునాది వేయడానికి సరిపడా బంతులను మేం ఆడలేకపోతున్నాం. పిచ్‌లో ఎలాంటి మార్పు రాలేదని నేను భావిస్తున్నా. భారత బౌలర్లు నాణ్యమైన బంతులు వేశారు. అది మిడిల్ ఓవర్లలో స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా 6 నుంచి 10 ఓవర్ల మధ్య భారత బౌలర్లు మా నడ్డిని విడిచారు.'అని ఎరాస్మస్ చెప్పుకొచ్చాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha