Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇంధన భద్రతకు 'సముద్ర మథనం'

ఇంధన భద్రతకు 'సముద్ర మథనం'

వార్త 2 days ago

Samudra Manthan : భారత దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న కొద్దీ ఇంధన అవసరాలు కూడా పెరుగుతున్నాయి. పరిశ్ర మలు, రవాణా, వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తి, పట్టణ జీవనం.

ఇలా ప్రతి రంగానికీ ఇంధనం అవసరం. ఈ అవ సరాలను తీర్చేందుకు ఇతర దేశాలపై ఎక్కువగా ఆధారపడ టం దీర్ఘకాలంలో దేశ ఆర్థికవ్యవస్థకు భారంగా మారే అవ కాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు మారడం, వివిధ దేశాల మధ్య ఉద్రిక్తతలు, యుద్ధాలు, సర ఫరాలో అంతరాయాలు వంటి పరిణామాలు మన ఇంధన భద్రతను ప్రభావితం చేయగలవు. అందుకే దేశంలోనే లభించే వనరులను గుర్తించి వినియోగించుకోవడం అత్యవ సరంగా మారింది. ఈ నేపథ్యంలో సముద్ర గర్భంలో దాగి ఉన్న చమురు, సహజవాయు నిల్వలను అన్వేషించేందుకు రూ.84,084 కోట్లతో సముద్ర మంథన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంత రించుకుంది. రాబోయే ఐదేళ్లలో లోతైనసముద్ర ప్రాంతాల్లో విస్తృతంగా తవ్వకాలు చేపట్టడం, సముద్ర గర్భంలోని వన రులపై సమగ్ర సమాచారం సేకరించడం, గుర్తించిన నిల్వల నుంచి ఉత్పత్తి ప్రారంభించేందుకు అవసరమైన మౌలిక వస తులను కల్పించడం ఈ కార్యక్రమంలోని ప్రధాన లక్ష్యాలు.

 Samudra Manthan

Samudra Manthan : దేశీయంగా సమకూర్చుకోవడం దీని ప్రధాన ఉద్దేశం

ఇది కేవలం చమురు, సహజవాయు కోసం చేసే అన్వేషణ కాదు. దేశ భవిష్యత్తు ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టు కుని రూపొందించిన దీర్ఘకాలిక ప్రణాళిక. సముద్రమంథనం మన పురాణాల్లో దాగిఉన్న అమృతాన్ని వెలికితీసినఘట్టం. అదే భావనను ఆధునిక కాలానికి అన్వయిస్తూ సముద్ర గర్భంలోని సహజ సంపదను వెలికితీసే కార్యక్రమానికి సముద్ర మంథన్ అనే పేరు పెట్టడం అర్థవంతంగా ఉంది. అయితే దీని లక్ష్యం కేవలం చమురు, సహజవాయు ఉత్ప త్తిని పెంచడం మాత్రమే కాదు. విదేశీ పరిణామాల వల్ల ఇంధన సరఫరాకు ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించి, దేశ అవసరాలకు తగినంత ఇంధనాన్ని సాధ్యమైనంత వరకు దేశీయంగా సమకూర్చుకోవడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమంలో లోతైన సముద్రాల్లో తవ్వకాలు, సముద్ర గర్భంపై సమాచార సేకరణ, ఉత్పత్తికి అవసరమైన మౌలిక వసతుల కల్పన, చమురు-సహజవాయు రంగానికి అవసర మైన పరికరాలు, సేవా కేంద్రాల అభివృద్ధికి పెద్ద మొత్తం లో నిధులు కేటాయిస్తున్నారు. ముఖ్యంగా సముద్ర గర్భా నికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడంపై చూపు తున్న శ్రద్ధ ఎంతో కీలకం. ఎక్కడ చమురు లేదా సహజ వాయు నిల్వలుండే అవకాశం ఉందో తెలుసుకోవడానికి సముద్ర గర్భంలోని భౌగోళిక నిర్మాణాన్ని ముందుగా అధ్య యనం చేయాలి. ఆధునిక శాస్త్ర సాంకేతిక పద్ధతులతో ఈ సమాచారాన్ని విశ్లేషించడం వల్ల అన్వేషణలో సమయం, ఖర్చు రెండింటినీ ఆదా చేయవచ్చు.

ప్రభుత్వ సహకారం చాలా అవసరం

లోతైన సముద్రాల్లో అన్వేషణ సాధారణ తవ్వకాలతో పోలిస్తే ఎంతో క్లిష్టమైనది. భారీ యంత్రాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నిపుణు లైన సిబ్బంది అవసరం. పెట్టుబడి కూడా ఎక్కువే. ఈ కార ణంగా ప్రారంభ దశలో ప్రభుత్వ సహకారం చాలా అవస రం. ప్రభుత్వం మద్దతు ఇస్తే ప్రైవేటు సంస్థలు, సాంకేతిక సంస్థలు కూడా ఈ రంగంలోకి రావడానికి ముందుకు వస్తాయి. దేశీయ సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనుభ వం ఉన్నా చిన్న సంస్థల భాగస్వామ్యంతో కొత్త సాంకేతికతమనకు అందుబాటులోకి వచ్చే అవకాశంఉంటుంది. ఈ కార్యక్రమం ఆత్మనిర్బర్ భారత్ లక్ష్యానికి కూడా బలాన్ని చేకూరుస్తుంది. ఆత్మనిర్భరత అంటే ప్రపంచంతో సంబంధాలు తెంచుకోవడం కాదు. మనకు అవసరమైన కీలకరంగాల్లో మన సామ ర్థ్యాన్ని పెంచుకుని, ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితిని తగ్గించుకోవడం. దేశంలోనే చమురు, సహజ వాయు ఉత్పత్తి పెరిగితే దిగుమతులపై ఒత్తిడి కొంత తగ్గుతుంది. విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసుకునే అవకాశంఉంటుంది. అంత ర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరిగినా వాటి ప్రభా వాన్ని కొంతవరకు నియంత్రించగలుగుతాం. ఇక ఈ కార్య క్రమం వల్ల ప్రయోజనం కేవలం ఇంధన రంగానికే పరిమి తంకాదు. లోతైనసముద్ర అన్వేషణకు అవసరమైన యంత్రాలు, పరికరాలు, నౌకలు, సాంకేతిక సేవలు, ఇంజినీరింగ్ పనులు, సమాచార విశ్లేషణ వంటి అనేక రంగాలుఅభివృద్ధి చెందుతాయి. దేశీయ సంస్థలకు కొత్త అవకాశాలులభిస్తాయి. కొత్త నైపుణ్యాలు అవసరమవడంతో యువతకు ఉపాధి అవ కాశాలు పెరిగే అవకాశంఉంది. ఈవిధంగా సముద్రమంథన్ దేశ పారిశ్రామిక రంగానికికూడా కొత్త ఊపునిచ్చే సామర్థ్యం కలిగి ఉంది. ఇంధనం విషయంలో స్వావలంబనకు ఆర్ధిక ప్రాధాన్యంతో పాటు వ్యూహాత్మక ప్రాధాన్యమూ ఉంది. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగాలంటే ఇంధన సరఫరా నిరంతరంగా ఉండాలి,

ఆర్థిక అవసరం మాత్రమే కాదు

అంతర్జాతీయ సంక్షోభాలు, యుద్ధాలు లేదా సరఫరా మార్గాల్లో అంతరాయాలు ఏర్పడినప్పుడు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటాయి. అందువల్ల దేశీయ వనరులను అభివృద్ధి చేసుకోవడం ఆర్థిక అవసరం మాత్రమే కాదు. జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కూడా. అయితే సముద్ర సంపదను వినియోగించుకునే క్రమంలో పర్యావరణాన్ని విస్మ రించకూడదు. సముద్రంలో అనేక రకాల జీవులు, చేపల సంపద, సున్నితమైన పర్యావరణ వ్యవస్థలున్నాయి. తీర ప్రాంత ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారుల జీవనోపాధి కూడా సముద్రంపైనే ఆధారపడి ఉంది. కాబట్టి అన్వేషణ పనులు చేపట్టేటప్పుడు సముద్ర జీవవైవిధ్యానికి, మత్స్యకా రుల ప్రయోజనాలకు నష్టంకలగకుండా జాగ్రత్తలు తీసుకో వాలి, ఆధునిక భద్రతా ప్రమాణాలు, పర్యావరణ నియ మాలు కచ్చితంగా అమలు చేయాలి. అలాగే భారీగానిధులు కేటాయించడం మాత్రమే కార్యక్రమం విజయానికి హామీ కాదు. పనులు నిర్ణయించిన సమయంలో పూర్తికావాలి. వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండాలి. నిపుణుల సేవలను సమర్థంగా వినియోగించుకోవాలి. అనుమతుల విషయంలో అనవసర జాప్యం లేకుండా చూడాలి. పెట్టు బడిదారులకు స్పష్టమైన విధానాలు, స్థిరమైన నిబంధనలు ఉండాలి. అప్పుడే ఈభారీ కార్యక్రమం ఆశించిన ఫలితాలను అందిస్తుంది.

 Samudra Manthan

ప్రత్యామ్నా యంగా చూడకుండా..

భారతదేశ భవిష్యత్తు ఇంధన అవసరాలను తీర్చుకోవడంలో చమురు, సహజవాయుతో పాటు సౌర, పవన, జల, అణు, హరిత ఇంధన వనరులకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. ఒకదానిని మరొకడానికి ప్రత్యామ్నా యంగా చూడకుండా, అన్నింటినీ సమన్వయం చేసుకున్న సమగ్ర ఇంధన విధానం అవసరం, దేశీయ చమురు, సహజవాయు అన్వేషణ ఆ విధానంలో ఒకముఖ్యమైన భాగంగా ఉండాలి. ఈదృష్టితో చూస్తే సముద్ర మంథన్ ఒక సాధారణ ప్రభుత్వ పథకం కాదు. భారతదేశం తన సముద్ర సంపద ను కొత్త కోణంలో చూసే ప్రయత్నం. దేశీయ ఇంధన వన రులను పెంచడం, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవ డం, పెట్టుబడులను ఆకర్షించడం, దేశీయ పరిశ్రమలను బలోపేతం చేయడం, ఉపాధి అవకాశాలను పెంచడంవంటి అనేక లక్ష్యాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో కీలక రంగాల్లో విదేశీ ఆధారాన్ని తగ్గించి దేశీయ సామర్థ్యాన్ని పెంచుకోవడం నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమైన విధానాల్లో ఒకటి. ఆ క్రమంలో సముద్ర మంథన్ మరో ముఖ్యమైన అడుగు. సముద్ర గర్భంలో ఉన్న సంపదను వెలికితీయడం ఎంత ముఖ్యమో, దానిని శాస్త్రీయంగా, బాధ్యతాయుతంగా వినియోగించడం కూడా అంతే ముఖ్యం. ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయగలిగితే, భారతదేశ ఇంధన భద్రత మరింత బలోపేత మై, స్వావలంబన దిశగా దేశ ప్రయాణానికి ఇది ఒక కీలక మలుపుగా నిలిచే అవకాశం ఉంది.

-వనకల్ల వీరప్ప

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

జలకళ సంతరించుకుంటున్న తెలంగాణ జలాశయాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha