Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇంధన పన్నులతో నిండుతున్న ప్రభుత్వ ఖజానా

ఇంధన పన్నులతో నిండుతున్న ప్రభుత్వ ఖజానా

వార్త 4 months ago

Fuel Taxes: పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించిన పన్నులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాకు బంగారు బాతు గుడ్డులా మారాయి. అంతర్జాతీయంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగినా, తగ్గినా భారత్లో మాత్రం దాని ధరల పెరుగుదల కొనసాగు తూనే వుంటోంది.

అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు పెరిగిన ప్రతీసారి లేదా మధ్య ఆసియాలో యుద్ధ మేఘాలు నెలకొన్న సమయంలో, గల్ఫ్ దేశాల్లో సంక్షోభం ఏర్పడినపుడు భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశానంటుతుండగా, అక్కడ వీటి ధరలు పతనం అయిన సమయం లో ఇక్కడ మాత్రం పన్నుల పేరిట సర్దుబాటు చేయడం పరిపాటిగా మారింది. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టి టి పరిధిలోకి తేవాలని నివు ణులు చెబుతున్నా కేంద్రం ససేమిరా అంటుండగా దీని కారణంగా వాహదారుల జేబులకు చిల్లులు పడుతూనే వుంది.

Read also: Modi : చరిత్ర సృష్టించనున్న ప్రధాని మోదీ

 Government coffers are filled with fuel taxes

Fuel Taxes: అంతర్జాతీయ మార్కెట్ అనుసంధానం – వాస్తవ పరిస్థితులు

భారత్లో చమురు ధరల పై ప్రభుత్వ నియంత్రణ వదులు కోవడం అనేది వాస్తవ పరిస్థితుల్లో కనిపించదు. గతంలో లాగా చమురు ధరల నియంత్రణను కేంద్రం అంత ర్జాతీయ మార్కెట్కు చాలా కాలం క్రితమే గా అనుసంధానం చేయగా వాస్తవంలో మాత్రం దీనికి భిన్నంగా వుండడం ఒక్క భారత్లోనే చెల్లుబాటు అవుతుందని చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగినపుడు ఆ భారాన్ని వినియోగదారులు పంచుకుంటున్నారు. అ యితే ధరలు పతనమైన సందర్భాలలో విని యోగదారులకు ఎలాంటి ప్రమోజనం కలగడం లేదు. దీనికి అసలు కారణం ఏమిటంటే కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలు హఠాత్తుగా పలురకాల సుంకాలు విధించి వినియోగదారులకు ప్రయోజనం లేకుండా చేస్తున్నాయి. దీనివల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలకు అదనంగా ఆదాయం అందుతున్నాయి.

కరోనా సమయం నాటి పన్నుల వసూళ్లు

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినపుడు భారత్లో ధరలు తగ్గిన సందర్భాలు వేళ్లమీద లెక్కించవచ్చు. ఒకవేళ తగ్గిన పది పైసల నుంచి పావులా వరకే అని చెప్పాలి. అనేకసార్లు ఆవే ధరలను కొనసాగిస్తారు. కరోనా సమయం లో 2020 ఫిబ్రవరి నెలలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గినా భారత్లో దాని ప్రభావం వాహనదారులకు నయాపైసా కూడా అందలేదంటే కేంద్రం సహా రాష్ట్రాలు పన్నులను ఎంతగా వసూలు చేశాయో అర్ధం చేసుకోవచ్చు.

గతంలో చమురు ధరలను కేంద్రం పూర్తిగా నియంత్రించేది. ఏడాదికి ఒక సారి లేదా రెం డుసార్లు ధరలను పెంచడం జరిగేది. కిరోసిన్తో పాటు ఎల్పిజి కూడా సర్కారు నియంత్ర ణలోనే వుండేవి. 2002లో తొలిసారిగా విమానాలకు వినియోగించే ఇంధనంపై నియంత్రణను కేంద్రం వదులుకుంది. ఆ తరువాత 2010లో పెట్రోల్పై 2014లో డీజిల్పై నియంత్రణను వదులుకుంది. కిరోసిన్, ఎల్పిజి నియంత్రణను మాత్రం కేంద్రం తన ఆధీనంలోనే వుంచుకుంది. పెట్రల్, డీజిల్ ధరలపై నియంత్రణను కేంద్రం వదులుకున్నా దాని ప్రభావం వాహనదారులకు లేక పోవడం గమనార్హం. 2022 అక్టోబర్ నెల లో భారత్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల భారీగా వుండడం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోదఫా ఆ స్థాయిలో పెరుగుదల వుండడం గమనార్హం. ఈసారి రెండు వారాల్లో ఎనిమిది రూపాయలకు పైగా ధరలు పెరగగా ఇది 25 రూపాయలను దాటనుందని వార్తలు వస్తున్నాయి.

ధరలు ఎందుకు తగ్గడం లేదంటే…?

ఇక భారత్లో చమరు ధరలు తగ్గక పోవడం వెనుక సవాలక్ష కారణాలు వున్నాయి. ర్జాతీయంగా ముడి చమురు ధరల పెరు ఒక కారణంగా చూపుతున్నారు. దీంతో గల్ఫ్ సంక్షోభం, ఇరాన్పై అమెరికా హర్మూజ్ జల సంధి మూసివేత వంటి కాం తాజా పెరుగుదలకు కారణంగా వునా ఇరాన్పై అమెరికా దాడి కారణంగా అంతర్జా మార్కెట్లో క్రూడ్ఆయిల్ ధర 91 డాలర్లను గా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు 98 డా దాటింది. అయితే గతంలో ఈ ధరలు వం లర్లను దాటిన ఘటనలు వున్నాయి. ఆ స లో భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగక పోవడం గమనార్హం. కరోనా సమం 2020 మార్చిలో ముడి చమురుధర 35 డాలర్ లకు పడిపోయింది. మార్చి చివరినాటికి ఇది ఎన్నడూ లేనంతగా 20 డాలర్ల కనిష్ట పడిపోయింది. అయితే అంతర్జాతీయ ముడిచమురు ధరలు అతి తక్కు వగా వున రోజుల సమయంలో భారత్ లో వినియోగదారులకు ఎలాంటి లాభం చేకూరలేదు. ఇదే సమంయంలో కేంద్రం తన పన్నుల వాటాను పెంచుకునేందుకు ఎక్సైజ్ డ్యూటీని రెండుసార్లు పెంచింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

కట్టుదిట్టమైన భద్రత నడుమ వారణాసి రైల్వే స్టేషన్ లోపల మజార్, మసీదు కూల్చివేత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha