Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

వార్త 1 month ago

Indigo: ఇండిగో (IndiGo) విమానంలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి కోల్‌కతా బయలుదేరిన విమానంలో బాంబు ఉందంటూ రాసి ఉన్న ఒక నోట్ లభించడం ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Spinal Cord Transplant : చైనా, రష్యా డాక్టర్లు అద్భుతం !

వాష్‌రూమ్ అద్దంపై బెదిరింపు సందేశం

ఫుకెట్ నుంచి కోల్‌కతా వస్తున్న ఇండిగో విమానం గాల్లో ఉండగా.. సిబ్బంది విమానంలోని వాష్‌రూమ్‌ను పరిశీలించారు. ఆ సమయంలో వాష్‌రూమ్ అద్దంపై బాంబు బెదిరింపు సందేశం రాసి ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే అప్రమత్తమై విమాన పైలట్‌కు, అధికారులకు సమాచారం అందించారు.

సురక్షితంగా ల్యాండింగ్.. ఐసోలేషన్ బేకి తరలింపు

సమాచారం అందుకున్న కోల్‌కతా ఎయిర్‌పోర్ట్ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. విమానం కోల్‌కతా విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే, సిబ్బంది ప్రయాణికులందరినీ అత్యంత సురక్షితంగా కిందికి దించారు. అనంతరం విమానాన్ని తక్షణమే ప్రత్యేకంగా కేటాయించిన ‘ఐసోలేషన్‌ బే’కి తరలించారు.

తనిఖీల్లో తేలిన నిజాలు

విమానాన్ని ఐసోలేషన్‌ బేకి తరలించిన తర్వాత బాంబ్‌ స్క్వాడ్, సీఐఎస్‌ఎఫ్‌ (CISF) బలగాలు, ఎయిర్‌పోర్ట్ పోలీసులు రంగంలోకి దిగారు. విమానం అంతటా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది కేవలం ఒక అబద్ధపు బెదిరింపుగా తేలింది.

వరుసగా రెండో రోజు కూడా..

శుక్రవారం కూడా విమానాశ్రయంలోని మహిళల వాష్‌రూమ్‌లో ఇలాంటిదే మరో బాంబు బెదిరింపు నోట్‌ కనిపించడం గమనార్హం. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే ఇలా వరుసగా రెండో సారి సంఘటన చోటుచేసుకోవడంతో విమానాశ్రయ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.

సీసీటీవీల పరిశీలన, పటిష్ట భద్రత

వరుస ఘటనల నేపథ్యంలో అధికారులు ఎయిర్‌పోర్టులో మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఈ ఘతులకు పాల్పడుతున్న నిందితులను గుర్తించేందుకు విమానాశ్రయం మరియు విమానంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని స్పష్టం చేశారు.

అమెరికాకు రష్యా డీజిల్‌ సరఫరా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha