Indira Gandhi Death Anniversary: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని శక్తి స్థల్ వద్ద కాంగ్రెస్ నేతలు ఘనంగా నివాళులర్పించారు.
శనివారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పాటు ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరా గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు.
Read Also :Hyderabad: హాస్టల్ ముసుగులో అక్రమ దందా.. హైదరాబాద్‌లో ఫెర్టిలిటీ రాకెట్ గుట్టురట్టు
Indira Gandhi Death Anniversary: ఇందిరా గాంధీ సేవలను గుర్తు చేసుకున్న రేవంత్
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. దేశాభివృద్ధికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమని గుర్తు చేశారు. ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొని ఆమెకు నివాళులర్పించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
అధిక ధరలకు బియ్యం విక్రయిస్తే కఠిన చర్యలు.. మంత్రి ఉత్తమ్ కుమార్

