Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇందిరమ్మ ఫ్లాట్లకు మీరు అర్హులేనా.. చెక్‌ చేసుకోండి ఇలా!

ఇందిరమ్మ ఫ్లాట్లకు మీరు అర్హులేనా.. చెక్‌ చేసుకోండి ఇలా!

వార్త 1 month ago

Indiramma Indlu List: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ప్రాథమిక జాబితాను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది.

దరఖాస్తు చేసుకున్న పౌరులు తమ అప్లికేషన్ స్టేటస్‌ను అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో సరిచూసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

గ్రేటర్ పరిధిలోని క్యూర్‌ (QUR) విభాగంలో మొత్తం 7,340 ఇళ్ల కేటాయింపు కోసం ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించింది. ఈ కేటాయింపుల కోసం మొత్తం 60,720 దరఖాస్తులు రాగా, క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అధికారులు అందులో 40,000 మందిని అర్హులుగా గుర్తించారు. దరఖాస్తుదారులు తమ అప్లికేషన్ స్టేటస్‌ను తెలుసుకోవడానికి తెలంగాణ హౌసింగ్ బోర్డు పోర్టల్ ను సందర్శించవచ్చు.

Read Also: Konda Surekha : ఏ క్షణమైనా కొండా సురేఖ ను క్యాబినెట్ నుంచి తొలగిస్తారా ?

 Are you eligible for Indiramma flats? Check here!

Indiramma Indlu List: అనర్హులకు అవకాశం: అభ్యంతరాల నమోదుకు గడువు

పరిశీలనలో అనర్హులుగా తేలిన అభ్యర్థులకు తమ వైపు నుంచి విజ్ఞప్తులు చేసుకునేందుకు ప్రభుత్వం మరొక అవకాశం కల్పించింది. జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, బాధితులు ఆగస్టు 23 సాయంత్రంలోపు పోర్టల్‌లోనే తమ ఫిర్యాదులు లేదా అభ్యంతరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అందిన దరఖాస్తులను పునఃపరిశీలించిన అనంతరం, ఆగస్టు 25న అంతిమ (ఫైనల్) అర్హుల జాబితాను ప్రకటించనున్నారు.

ఫైనల్ లిస్ట్ విడుదలైన తర్వాత పారదర్శకంగా ఇళ్లను కేటాయించేందుకు లక్కీ డ్రా (లాటరీ) విధానాన్ని అమలు చేయనున్నారు. ఆగస్టు 27 నుంచి ఆగస్టు 30 వరకు లాటరీ పద్ధతి ద్వారా అర్హులకు ఇళ్లను కేటాయిస్తారు. పథకానికి సంబంధించిన సందేహాలు లేదా అదనపు సమాచారం కోసం దరఖాస్తుదారులు 040-24603572 అనే హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.

Epaper: epaper.vaartha.com

సీఎం టూర్ రద్దుపై బీజేపీ చీఫ్ స్పష్టత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha