Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం!

ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం!

వార్త 1 week ago

MLA Sanjeeva Reddy: ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల నెరవేరుతుందని నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. సోమవారం నాడు పెద్ద శంకరంపేట తో పాటు మండల పరిధిలోని బద్దారం గ్రామంలో లబ్ధిదారులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశం చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ పేదల సొంతింటి కల సాకారం కావాలన్నదే ప్రభుత్వం లక్ష్యం అన్నారు.

Read Also : బండి సంజయ్ తప్పు చేశాడన్న మంత్రి పొన్నం ప్రభాకర్

 MLA Sanjeeva Reddy

అర్హులైన ప్రతి పేదవానికి గూడు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అనంతరం విధ్యా వారోత్సవాల సందర్భంగా పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరు అయినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సర్పంచ్ జంగం రేణుక శ్రీనివాస్, ఉప సర్పంచ్ రాజు గౌడ్, ఎంపీడీవో క్రాంతి కుమార్, హౌసింగ్ డిఇ ప్రసన్న, ఏఈ కౌశిక్ రెడ్డి, ఎంఈఓ శేఖర్, నాయకులు మధుసూదన్ నారా గౌడ్, మురళి పంతులు సుభాష్ గౌడ్, చాకలి నారాయణ, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు పెరుమాల్ గౌడ్, ఎంపీ ఓ జాకీర్ హుస్సేన్, ఈవో వెంకట్ రాములు తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం రేవంత్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha