భగీరథ్ కేసుపై రాజకీయ దుమారం
Telangana Political : బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్‌లోని పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో 17 ఏళ్ల బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, పోలీసులు పోక్సో చట్టంలోని సెక్షన్లు 11, 12తో పాటు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భగీరథ్ తనను మద్యం తాగించి ఫామ్‌హౌస్‌లో లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది.
ఈ కేసుపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. కేసు దర్యాప్తు ఎందుకు ఆలస్యమవుతోందని డీజీపీ సీవీ ఆనంద్‌పై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తక్షణమే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
బండి సంజయ్‌పై పొన్నం విమర్శలు
ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ తన కుమారుడిపై ఆరోపణలు వచ్చిన వెంటనే నిష్పక్షపాత విచారణ కోరాల్సిందని ఆయన అన్నారు. కుట్ర జరుగుతోందని ఆరోపించడం కంటే, బాధితురాలు నిజంగా భగీరథ్‌ను కలిసిందా లేదా అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలని సూచించారు. కొంతమంది మున్నూరు కాపు నాయకులు ఈ కేసులో కుట్ర ఉందని మాట్లాడుతున్నారని, కానీ బాధితురాలు కూడా అదే వర్గానికి చెందిన అమ్మాయేనని పొన్నం పేర్కొన్నారు. కులం లేదా రాజకీయాల పేరుతో ఈ కేసును మళ్లించే ప్రయత్నాలు చేయొద్దని ఆయన హెచ్చరించారు.
Read Also:Tamilnadu Politics : DMKపై కాంగ్రెస్ ఆగ్రహం !
Telangana Politicalవిచారణపై కీలక వ్యాఖ్యలు
వేరే పార్టీకి చెందిన నాయకుడు కావడంతో బండి సంజయ్‌పై వివక్ష చూపే అవకాశం లేదని, అదే సమయంలో ఆయన కేంద్ర మంత్రి అన్న కారణంతో కేసు దర్యాప్తు పక్కదారి పట్టదని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, విచారణ పూర్తిగా చట్ట ప్రకారం సాగుతుందని ఆయన తెలిపారు. ఈ కేసు రాజకీయంగా మరింత వేడెక్కుతున్న నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు ప్రత్యేక బృందాలతో కేసు దర్యాప్తును వేగవంతం చేసినట్లు సమాచారం.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

