Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇందిరమ్మ ఇళ్లకు రూ.230కే సిమెంట్ బస్తా.. మంత్రి పొంగులేటి

ఇందిరమ్మ ఇళ్లకు రూ.230కే సిమెంట్ బస్తా.. మంత్రి పొంగులేటి

వార్త 1 month ago

Indiramma Housing Scheme: ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం లో సిమెంట్ పరిశ్రమలు భాగస్వాములు కావాలని రాష్ట్ర హౌసింగ్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు.

సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంట్ ధరల తగ్గింపుపై సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలతో ఆయన సమావేశమయ్యారు. మంత్రి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన యాజమాన్యాలు, ఒక్కో సిమెంట్ బస్తాను రూ.230లకే అందించేందుకు సమ్మతించాయి

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కేవలం ఒక గృహ నిర్మాణ కార్యక్రమం మాత్రమే కాదని వ్యాఖ్యానించారు. పేద కుటుంబాలకు సామాజిక భద్రత, ఆత్మగౌరవం, గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించే మహాయజ్ఞంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు.

Read Also: Shakti Policy GO 97 protest : శక్తి పాలసీపై పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన

 Cement bag for ‘Indiramma Houses’ at just Rs. 230: Minister Ponguleti

Indiramma Housing Scheme: వేగంగా సాగుతున్న గృహ నిర్మాణాలు

రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత కింద మంజూరు చేసిన 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లలో దాదాపు 85 శాతం ఇళ్లకు సంబంధించి శ్లాబుల నిర్మాణం పూర్తయిందని మంత్రి వెల్లడించారు. మిగిలిన 15 శాతం ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో వేగవంతంగా ముందుకు సాగుతున్నాయన్నారు.

  • రెండో విడత లక్ష్యం: నియోజకవర్గానికి 2,000 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడతలో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
  • ఇందిరమ్మ టవర్స్: ‘క్యూర్’ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకొని, ప్రయోగాత్మకంగా 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు.

పారదర్శకంగా నిధుల విడుదల

ఇళ్ల నిర్మాణ పురోగతికి అనుగుణంగా ప్రతి సోమవారం విడతల వారీగా అత్యంత పారదర్శకంగా నిధులను లబ్ధిదారులకు విడుదల చేస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రభుత్వం పిలుపునకు స్పందించి రాయితీ ధరకే సిమెంట్ సరఫరా చేసేందుకు ముందుకు వచ్చిన సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Epaper: epaper.vaartha.com

ఉద్యోగుల సమస్యలపై బీజేపీ అండగా ఉంటుంది: బండి సంజయ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha