Indiramma illu housing scheme: మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో లబ్ధిదారురాలికి మంజూరైన ఇందిరమ్మ ఇంటిని TGIIC చైర్మన్ తూర్పు నిర్మలా జగ్గారెడ్డి బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నామని, లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సదాశివపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తోపాజి అనంత కిషన్ మాట్లాడుతు.. అర్హులైన పేదలందరికీ వివక్ష లేకుండా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల రెడ్డి,జగ్గారెడ్డి కృషితో పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి పరచగలమని అన్నారు.
Read Also:TG debts calculation: బీఆర్ఎస్ హయాంలో రూ.8.21 లక్షల కోట్ల అప్పు.. భట్టి విక్రమార్క సంచలనం!
Indiramma illu housing scheme: కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మునిపల్లి అంజమ్మ, వైస్ చైర్మన్ రేణుక,కో ఆప్షన్ సభ్యుడు సత్యనారాయణ, వార్డు కౌన్సిలర్ ఎర్ర విశాలి,, మున్సిపల్ కమీషనర్ తౌటం శివాజి, హౌసింగ్ AE రేష్మ, పట్టణ ఇంచార్జ్ తోపాజి అనంత కిషన్, స్థానిక పట్టణ అధ్యక్షులు పట్లూరి నాగరాజ్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ, కౌన్సిలర్లు అరుణ్ వాజిద్ కో ఆప్షన్ సభ్యులు రహ్మత్ వాజిద్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పట్నం సుభాష్ శరత్ సాబేర్ నాయకులు పవన్ భరత్,బాబు కాంగ్రెస్ కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Epaper: epaper.vaartha.com
కొత్త పాస్ బుక్ రైతులకు అలర్ట్.. రైతు భరోసాకు 2 రోజులే ఛాన్స్!

