Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకం విధివిధానాలు ఖరారు !

'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకం విధివిధానాలు ఖరారు !

వార్త 3 months ago

Indiramma kutumba jeevitha bheema : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలలో భాగంగా ప్రకటించిన మరో ప్రతిష్టాత్మక గ్యారంటీ 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' (Indiramma Bheema) పథకం అమలుకు మురకడుగు పడింది.

ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలు (Guidelines) దాదాపుగా ఖరారైనట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు (Food Security Card) కలిగిన ప్రతి కుటుంబానికి ఈ రూ. 5 లక్షల ఉచిత జీవిత బీమా సౌకర్యాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. కుటుంబంలో సంపాదించే ముఖ్య వ్యక్తి లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా అకాల మరణం చెందితే, ఆ నిరుపేద కుటుంబం రోడ్డున పడకుండా ఆర్థిక భరోసా కల్పించడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. లబ్ధిదారుల నమోదు ప్రక్రియ కోసం వచ్చే నెల (జూన్) లో ప్రభుత్వ సిబ్బంది నేరుగా ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించనున్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీన ఈ పథకానికి సంబంధించిన అధికారిక విధివిధానాల జీవోను ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది.

Read Also ; జడ్చర్ల లో గాలివాన బీభత్సం!

10 రోజుల్లోనే క్లెయిమ్ సెటిల్మెంట్.. నామినీ ఖాతాలోకి నిధులు

గతంలో ఉన్న ప్రభుత్వ బీమా పథకాల్లో క్లెయిమ్ డబ్బులు రావడానికి నెలల తరబడి సమయం పట్టి లబ్ధిదారులు ఇబ్బంది పడేవారు. అయితే, ఈ ఇందిరమ్మ బీమా పథకంలో అలాంటి ఆలస్యానికి తావులేకుండా అత్యంత పారదర్శకమైన, వేగవంతమైన క్లెయిమ్ విధానాన్ని ప్రభుత్వం తీసుకురాబోతోంది. బీమా పొందిన వ్యక్తి ఏ కారణం చేతనైనా మరణిస్తే, మరణం సంభవించిన కేవలం 10 రోజుల్లోనే రూ. 5 లక్షల బీమా సొమ్మును నేరుగా సదరు లబ్ధిదారుడి నామినీ (Nominee) బ్యాంకు ఖాతాలోకి జమ అయ్యేలా కఠినమైన నిబంధనలను రూపొందించారు. దీనికోసం ప్రత్యేకమైన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను మరియు క్షేత్రస్థాయి రెవెన్యూ, పంచాయతీ సిబ్బందితో కూడిన ప్రత్యేక యంత్రాంగాన్ని బాధ్యులను చేయనున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పెన్షన్లతో పాటు ఈ కుటుంబ బీమా పథకం కూడా పేదలకు కొండంత అండగా నిలుస్తుందని పాలకపక్షం భావిస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

ధాన్యం తడిసినా కొనాల్సిందే..అధికారులకు ఉత్తమ్ ఆదేశాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha